చీరలో మెరిసిపోతున్న అందాల మీనాక్షి

మీనాక్షి చౌదరి కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఇటీవలే పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

Update: 2024-10-27 02:45 GMT

మీనాక్షి చౌదరి తన తాజా ఫోటోషూట్ లో అందరిని ఆకట్టుకునేలా కనిపించారు. ఆమె ధరించిన తెల్ల చీరలో చూడచక్కని అందంతో మెరిసిపోతున్నారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, "Feeling Haseen" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. టాలీవుడ్ లో తన గ్లామర్ మరియు స్టైలిష్ లుక్స్ తో మెప్పిస్తున్న ఈ బ్యూటీ, తన ట్రెడిషనల్ లుక్ లో కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుందని మరోసారి రుజువు చేశారు.


మీనాక్షి చౌదరి కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఇటీవలే పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అక్కినేని సుశాంత్ సరసన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' చిత్రం ద్వారా తెరపై అడుగుపెట్టిన ఈ అందాల రాశి, ఆ తరువాత రవితేజతో 'ఖిలాడి' లో నటించి తన గ్లామర్ షోతో అందరినీ మెప్పించారు. కానీ, ఆ సినిమా ఆశించినంత హిట్ అవ్వకపోయినా, మీనాక్షికి ప్రేక్షకులలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది.


ఆమె నటించిన 'హిట్ 2' చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పాత్రల్లోనే కాకుండా నటనకు కూడా స్కోప్ ఉన్న పాత్రల్లో ఆమె మెరవడం ఆమెకు మరింత మంచి పేరును తీసుకొచ్చింది. మహేష్ బాబు 'గుంటూరు కారం', విజయ్ 'ది గోట్' వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఆమె రీసెంట్ గా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు.


దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం, ఆమెకు మంచి హిట్ అందించే అవకాశం కల్పిస్తుందని అందరూ భావిస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌తో 'మెకానిక్ రాకీ' లోనూ, మెగా హీరో వరుణ్ తేజ్ సరసన 'మట్కా' చిత్రంలోనూ నటిస్తున్నారు. వీటితో పాటు, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మరో చిత్రంలోనూ మీనాక్షి నటిస్తున్నారు.


మీనాక్షి చౌదరి ఇంత వరకూ తాను చేసిన సినిమాల్లో నటనతో మాత్రమే కాకుండా తన గ్లామర్, స్టైల్, ప్రత్యేకతతో ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ప్రస్తుతం ఆమె తన కెరీర్ లో మంచి స్థాయికి చేరుకోవాలని, వరుసగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Tags:    

Similar News