గుంటూరు కారం.. మరి ఆ పాప సంగతేంటి?

అయితే ఇందులో మరొక బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది అని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఆమె గురించి పెద్దగా సౌండ్ లేదు.

Update: 2023-12-30 06:14 GMT

త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా రీసెంట్గా మరొక సాంగ్ ప్రోమో విడుదల చేశారు. కుర్చీని మడతపెట్టి.. అనే ఈ మాస్ సాంగ్ పై ఓ వర్గం ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ తప్పకుండా పూర్తిస్థాయిలో పాట మాత్రం ఆకట్టుకుంటుంది అని నిర్మాతలు చెబుతున్నారు.

మహేష్ బాబు శ్రీ లీల ఇద్దరు కూడా మాస్ స్టెప్పులతో విజిల్స్ వేయించే విధంగా కనిపిస్తారు అని కూడా నాగవంశీ తెలియజేశాడు. అయితే గుంటూరు కారం సినిమాలో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ లలో అయితే ఎక్కువగా శ్రీలీల మాత్రమే హైలెట్ గా నిలిచింది. అయితే ఇందులో మరొక బ్యూటీ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది అని ఇదివరకే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఆమె గురించి పెద్దగా సౌండ్ లేదు.

ఆమె సినిమాలో ఉంది అని విషయం మాత్రమే చెప్పారు కానీ ఎలాంటి పాత్ర చేస్తుంది? అసలు కథకు ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తుందా లేదంటే గుర్తింపు లేని సైడ్ గ్లామర్ పాత్ర చేస్తుందా? అనే అనుమానాలు చాలానే వస్తున్నాయి. త్రివిక్రమ్ సాధారణంగా తన ప్రతి సినిమాలో కూడా ఎవరో ఒకరిని సెకండ్ బ్యూటీగా గ్లామరస్ గా హైలెట్ చేస్తూ ఉంటాడు.

ఇక ఇప్పుడు మీనాక్షి కూడా అలాంటి పాత్రలో కనిపిస్తుందా లేదంటే ఏదైనా సెంటిమెంట్ పాత్రలో దర్శనమిస్తుందా అని సందేహాలు కలుగుతున్నాయి. అయితే మొదట పూజా హెగ్డేను ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా అనుకున్నారు. అప్పుడు శ్రీలీల సెకండ్ హీరోయిన్. ఆ తర్వాత మళ్లీ పూజాను తీసేసి శ్రీలీలను మేయిన్ హీరోయిన్ గా మార్చేశారు.

అప్పుడే మీనాక్షి చౌదరికి మరొక హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. తన గ్లామర్ తో బాగానే హైప్ పెంచుకుంది. అయితే గుంటూరు కారం అప్డేట్స్ లో మాత్రం ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన హింట్ అయితే ఇవ్వడం లేదు. దీంతో ఆమె పాత్ర రొటీన్ గా ఉంటుందా అనే అనుమానాలు ఎక్కువగా కలుగుతున్నాయి.

మీనాక్షి గ్లామర్ తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ అందుకుంది కాబట్టి శ్రీలీలతో పాటు ఆమెను కూడా హైలెట్ చేస్తే సినిమాకు మరొక లెవెల్లో హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఒక స్పెషల్ సాంగ్ పెట్టినా కూడా సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి చిత్ర యూనిట్ ఎందుకు ఆమె పాత్రను ఎక్కువగా హైలెట్ చేయడం లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    

Similar News