మీనాక్షి ముందు శ్రీలీల జుజూబీ!
ఇవి గాక అమ్మడికి ఇతర భాషల నుంచి ఛాన్సులు క్యూ కడుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుంది.
మీనాక్షి చౌదరి కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులెడుతోంది.'గుంటూరు కారం' తర్వాత అమ్మడు ఒక్కసారిగా ఊపందుకుంది. మీనాక్షి లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. రెండుకాదు..మూడు కాదు. ఏకంగా ఆరు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. వరుణ్ తేజ్ తో 'మట్కా', దుల్కార్ సల్మాన్ తో 'లక్కీ భాస్కర్', తలపతి విజయ్ తో ' ది గ్రేటెస్ట్ ఆఫ్ టైమ్', మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. మరో రెండు సినిమాలకు సైన్ చేయడానికి సిద్దంగా ఉంది.
ఇవి గాక అమ్మడికి ఇతర భాషల నుంచి ఛాన్సులు క్యూ కడుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుంది. ఇదంతా గుంటూరు కారం సక్సెస్ తోవచ్చిన అవకాశాలు అనుకుంటే తప్పే అవుతుంది. ఎందుకంటే అమ్మడు అందులో పోషించింది చిన్న పాత్రే. మహేష్ కి పెయిర్ కానే కాదు. కానీ ఆ సినిమా తర్వాతే ఇన్ని వేగం పెంచింది అన్నది వాస్తవం. వాస్తవానికి ఈ రేంజ్ లో సినిమాలు చేయాల్సింది శ్రీలీల. అందులో మహేష్ కి జోడీగా నటించింది ఆ బ్యూటీనే.
కుర్చీ పాటతో శ్రీలీల రేంజ్ అంతకంకు పెరిగింది. అంతకు ముందే మాస్ ఆడియన్స్ లోకి బలంగా వెళ్లింది. ఆ ఊపు చూసి టాలీవుడ్ లో శ్రీలీలకి తిరుగుండదనుకున్నారంతా. ఛాన్సులన్నీ అమ్మడివే అనుకున్నారంతా. మహేష్ రేంజ్ హీరోల నుంచి టైర్ -2 హీరోల వరకూ అంతా ఆమెకే ఛాన్సులిస్తారని భావించారు. కానీ బయట మార్కెట్ లో సన్నివేశం మరోలా కనిపిస్తుంది. గుంటూరు కారం తర్వాత శ్రీలీల ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదు.
పవన్ కళ్యాణ్ తో కమిట్ అయిన'ఉస్తాద్ భగత్ సింగ్' చేతిలో ఉన్న అది డిలే అవుతుంది. అది ఎప్పుడు పూర్త వుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో అమ్మడు కోలీవుడ్ వైపు చూస్తోంది. ఇప్పటికే అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఓ కాలేజీ ఈవెంట్ లో ఈ విషయం రివీల్ చేసింది. మొత్తానికి శ్రీలీల పరిస్థితి ఎలా ఉందంటే? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లేనని నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు.