పిక్టాక్ : పవన్ 'బంగారం' మరింత అందంగా..!
తాజాగా మరోసారి మీరా చోప్రా అందమైన ఫోటోలను షేర్ చేసింది.
పవన్ కళ్యాణ్ తో 'బంగారం' సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మీరా చోప్రా. ఇండస్ట్రీలో ఈ అమ్మడికి మొదటి సినిమాతోనే నిరాశ ఎదురైనా ఆఫర్లు మాత్రం బాగానే వచ్చాయి. బంగారం సినిమా తర్వాత వరుసగా తమిళ సినిమాలకి పరిమితం అయిన మీరా చోప్రాకి తెలుగు లో మళ్లీ 'వాన' అనే సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కూడా మీరా చోప్రాకి నిరాశను మిగిల్చింది. టాలీవుడ్లో ఈ అమ్మడికి కలిసి రాదని అంతా భావించారు. ఆఫర్లు రావడం కష్టం అయింది. మరో వైపు ఇతర భాషల్లోనూ ఈమెకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది.
కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా చోప్రా రీ ఎంట్రీ ఇచ్చింది. గత ఏడాది ఒక హిందీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా తర్వాత మీరా చోప్రా నుంచి వచ్చిన మొదటి సినిమా అదే కావడం విశేషం. మీరా చోప్రా సోషల్ మీడియాలోనూ ఈమధ్య కాలంలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు ఇరవై ఏళ్లు అవుతున్నా అదే అందం, అదే జోష్ మీరా చోప్రాలో కనిపిస్తోంది అంటూ సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు చూస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేయడంతో పాటు ఫోటోలకు తెగ లైక్స్ చేస్తున్నారు.
తాజాగా మరోసారి మీరా చోప్రా అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఈసారి బంగారం బ్యూటీ బంగారం వర్ణపు చీర కట్టులో చాలా కూల్ అండ్ క్యూట్ లుక్ లో కవ్విస్తూ ఫోజ్ ఇచ్చింది. ఈ స్థాయి అందం ఉన్నా మీరా చోప్రాను ఎందుకు ఫిల్మ్ మేకర్స్ పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నిరూపించుకునేందుకు ఒక్క ఛాన్స్ వస్తే ఈ అమ్మడు చాలు అన్నట్లుగా మీరా చోప్రా ఎదురు చూస్తున్నట్లుగా ఆమె ఫోటో షూట్స్ ను చూస్తే అర్థం అవుతుంది అంటూ మీడియా వర్గాల వారితో పాటు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
హీరోయిన్స్ కొంత గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మంచి విజయాలను సొంతం చేసుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. కనుక ఈసారి మీరా చోప్రా వంతు వచ్చింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. హీరోయిన్ పాత్రలే కావాలి అని ఎదురు చూడకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు చేస్తూ వెళ్తే తప్పకుండా మంచి సినిమాల్లో నటించే అవకాశాలు రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరి ఈ బంగారం బ్యూటీ తన కెరీర్ ను ఎలా మల్చుకుంటుంది, ఇంత అందం ను సద్వినియోగం చేసుకుని వెండి తెరపై మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.