మెగాస్టార్ 156 కొత్త వరల్డ్ రెడీ అవుతోంది!
ఈ సినిమా కోసం ఏకంగా ఓ ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టిస్తున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓసెట్ ని రూపొందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ఆయన 156వ చిత్రం 'విశ్వంభర' మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందో. సోషియా ఫాంటసీ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే సినిమాకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల్ని మారేడుమిల్లి .. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరించారు. ఆ షెడ్యూల్ అనంతరం యూనిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది.
ఇంతలోనే సంక్రాంతి పండుగ కూడా దగ్గర పడటంతో తాత్కాలికంగా ఎక్కడ షూటింగ్ అక్కడ ఆపేసారు. తాజాగా సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం ఏకంగా ఓ ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టిస్తున్నట్లు సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ ఏ.ఎస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓసెట్ ని రూపొందిస్తున్నారు. విజువల్ ఎఫెక్స్ట్ అధిక ప్రాధాన్యమున్న సినిమా కావడంతో సెట్ నిర్మాణం అంతే ప్రతిష్టాత్మకంగానూ జరుగుతోంది.
వీలైనంత వరకూ నాచురాలిటీని చూపించాలి కాబట్టి ఆ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సెట్లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్స్ అన్ని ప్రేక్షకుల్ని కొత్త ప్రపంచం లోకి తీసుకెళ్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసెట్స్ కి మెగాస్టార్ వచ్చే నెల తొలివారం నుంచి అడుగు పెట్టనున్నారుట. ఈ సినిమా షూట్ కి సంబంధించి చిరంజీవి ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో హాజరవ్వలేదు. ఇతర నటీనటులతో కీలక సన్నివేశాలుంటే హాజరయ్యారు.
ఆయనపై సోలోగా ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు. ఇప్పుడా సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోం ది. ప్రత్యేకంగా రూపొందిస్తున్న సెట్స్ లో చిరుపై కీలక సోలో సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. అలా గే అవే సెట్స్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. సోషియో ఫాంటసీ చిత్రం అనగానే అందరికీ చిరంజీవి నటించిన 'జగదీక వీరుడు అతిలోక సుందరి' గుర్తొస్తుంది. అందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల్ని అప్పట్లో కొత్తప్రపంచంలోకి తీసుకెళ్లాయి. అదే తరహాలో అంజి చేసినప్పటికీ ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత చిరు సోషియా ఫాంటసీ చిత్రాల జోలికి వెళ్లింది లేదు.