మెగా వెడ్డింగ్: ప్రిన్స్‌ని ప్రిన్సెస్‌ని డిజైన్ చేసేది ఆయ‌నే

ఈ ఇద్ద‌రి పెళ్లి వేడుక కోసం భార‌త‌దేశ‌పు నం.1 డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పోర్ట్స్ నుంచి కొన్ని దుస్తులను ఎంపిక చేసార‌ని తెలిసింది.

Update: 2023-09-18 04:50 GMT

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. తాను వ‌ల‌చిన లావ‌ణ్య త్రిపాఠిని పెళ్లాడేస్తున్నాడు. ఈ పెళ్లి యూరప్‌లో జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లికి సన్నాహాలు మొదలుపెట్టాయి. తాజా స‌మాచారం మేర‌కు.. వ‌ధూవ‌రులు లావ‌ణ్య‌-వరుణ్ తేజ్ ఇద్దరూ పెళ్లి షాపింగులు చేస్తున్నార‌ని స‌మాచారం. ఈ ఇద్ద‌రి పెళ్లి వేడుక కోసం భార‌త‌దేశ‌పు నం.1 డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పోర్ట్స్ నుంచి కొన్ని దుస్తులను ఎంపిక చేసార‌ని తెలిసింది. ఈ జంట హైదరాబాద్‌లోని డిజైనర్స్ స్టోర్‌లో కనిపించడంతో ఊహాగానాలు కొన‌సాగుతున్నాయి.

మనీష్ మల్హోత్రా తెలుగులో చాలా మంది తారల కోసం దుస్తులను డిజైన్ చేశారు. బాలీవుడ్ టు టాలీవుడ్ టాప్ స్టార్లతో స‌త్సంబంధాలు క‌లిగి ఉన్నా కానీ.. మ‌నీష్ ఒక స్టార్‌ను పెళ్లి కోసం అలంకరించడం ఇదే మొదటిసారి. వ‌రుణ్ - లావ‌ణ్య జంట పెళ్లి చాలా ప్రైవేట్‌గా ఉంటుందని, నవంబర్‌లో ఇటలీలో జరగనుందని సమాచారం. మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో న‌వ‌ జంట ఎలా మెరిసిపోనుందో వేచి చూడాలి.

వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి నవంబర్‌లో వివాహం చేసుకోబోతున్నారు. లావణ్య త్వరలో కోడలిగా కొత్త పాత్రలో ప్ర‌వేశించ‌నున్న వేళ సినీ కెరీర్ ప‌రంగా కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లో కాకుండా న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌ల్లో న‌టించాల‌ని లావ‌ణ్య ఆలోచిస్తున్నట్లు సమాచారం. మెగా ఫ్యామిలీతో కమిట్‌మెంట్స్ కారణంగా లావణ్య త్రిపాఠి తన కెరీర్‌పై పెద్ద నిర్ణయం తీసుకుంది.

ఇటీవ‌లి ఓ సోర్స్ వివ‌రాల‌ ప్రకారం.. జూన్‌లో తన నిశ్చితార్థం తర్వాత లావణ్య త్రిపాఠి కొన్ని ప్రధాన చిత్రాల నుండి తప్పుకుంది. మెగా ఫ్యామిలీకి ఉన్న కమిట్‌మెంట్‌తో ఆమె బోల్డ్ వెబ్ సిరీస్‌ను కూడా తిరస్కరించినట్లు చెబుతున్నారు. నిర్మాతలకు అడ్వాన్స్ ల‌ను తిరిగి ఇచ్చి త‌న‌ పాత్రకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనమని ప్రోత్సహించింద‌ని స‌మాచారం. త‌న వృత్తితో కుటుంబ జీవ‌నంపై ఎలాంటి ప్రభావం పడకూడదని లేదా వివాదాల్లో ఇరుక్కోకూడదని లావ‌ణ్య ఈ ఎత్తుగడలు వేస్తున్నారని స‌మాచారం.

ఈ జంట అంతరిక్షం 9000 KMPH - మిస్టర్ వంటి చిత్రాలలో కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఇప్ప‌టివ‌ర‌కూ వివాహ వివరాలను అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటలీలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. పెళ్లికి అతిథుల‌ జాబితాలో కేవలం 50 మంది వ్యక్తులు ఉంటారు. పెళ్లి తర్వాత, ఈ జంట పరిశ్రమ స్నేహితులు, రాజకీయ నాయకులు, హైదరాబాద్‌లోని బిగ్ షాట్స్ కోసం గ్రాండ్ రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు.

Tags:    

Similar News