మెగా ఫ్యామిలీ క్రికెట్ టీం.. మ్యాచ్ ప్లాన్ చేయాలట!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా కాంపౌండ్ నుంచి ఎంత మంది హీరోలు వచ్చినా.. అదంతా మెగాస్టార్ చిరంజీవి పుణ్యమేనని చెప్పాలి. ఆయన మహావృక్షం అయితే మిగతా వారందా దాని నీడలో ఉంటూ, పళ్లని తింటూ ముందుకెళ్తున్నారు. నాగబాబు, పవన్ కల్యాణ్ మొదలు.. రామ్‌చరణ్ అల్లుఅర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్, నిహారిక వరకు అందరూ.. ఆయన వేసిన బాటలో, రహదారిలో నడుస్తున్నవారే.
చాలా మంది మెగాఫ్యామిలీది ఓ క్రిికెట్ టీమ్ అని కూడా చెబుతుంటారు. తాజాగా ఈ కామెంట్స్‌ను మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా సమర్థించారు. తాజాగా ధర్మశాల వేదికగా జరిగిన న్యూజిలాండ్ - భారత్ మ్యాచ్ తెలుగు కామెంట్రీలో ఆయన పాల్గొన్నారు. తన కొత్త పాన్ ఇండియా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ కామెంటరీ బాక్స్‌లో సందడి చేశారు.
అక్కడే మెగాఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడారు. అందరు మమల్ని (మెగా హీరోలు) క్రికెట్ టీం అని అంటుంటారు. ఒక మ్యాచ్ ఏమైనా ప్లాన్ చేయండి. నేను బన్నీ అన్న, చరణ్ అన్న, తేజ్, శిరీష్ అందరం కలిసి వచ్చి ఆడతాం అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిపై ఆడియెన్స్ సరదా కామెంట్స్‌తో రియాక్ట్ అవుతున్నారు.
వరుణ్ 13వ సినిమాగా ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కింది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కించారు. ఇటీవలే ఈ మూవీకి గుమ్మడికాయ కొట్టేశాడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. డిసెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.
ఇకపోతే వరుణ్ తేజ్ మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు.
నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీ నగరంలో ఈ పెళ్లి జరగనుందని సమాచారం. డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరగనుంది.