మెహర్ రమేష్ లో న్యూ యాంగిల్ ఇది!
రేజ్ ఆఫ్ భోలా - మెగా ర్యాప్ గీతం పేరుతో త్వరలో విడుదల కానుంది ఈపాట. దీన్ని టీజర్ అండ్ ట్రైలర్ లో రివీల్ చేసారు.
అప్పుడప్పుడు దర్శకులే సాహితి వేత్తలు అయిపోతారు. త్రివిక్రమ్..పూరి జగన్నాధ్..శివ నిర్వాణ లాంటి వారు మంచి దర్శకులే కాదు. మంచి గీత రచయితలు కూడా. స్టోరీ..అందులో పాత్రలు డిమాండ్ చేస్తే వాళ్లే స్వయంగా కలం పట్టి పాటలు రాస్తుంటారు. త్రివిక్రమ్..పూరిది ఓ రకమైన శైలి అయితే శివ నిర్వాణ మరోర కమైన శైలిని అనుసరిస్తారు. ప్రేమికుల భావోద్వేగాల్ని టచ్ చేస్తూ ఎమోషనల్ గీతాలు రాయడం లో శివకి మంచి పట్టుంది.
'మజిలీ' సినిమా లో కొన్ని గీతాలు ఆయనే స్వయంగా రాసారు. సినిమాలో అవి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టు కున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ-సమంత జంటగా నటిస్తోన్న 'ఖుషీ' చిత్రాన్ని శివ తెరకెక్కి స్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లో మూడు పాటల్ని శివ స్వయంగా రాసాడు. ఇప్పటికే అవి రిలీజ్ అవ్వడం శ్రోతల్ని ఆకట్టుకోవడం జరిగింది. తాజాగా మరో డైరెక్టర్ కూడా పాటల రచయితగా మారినట్లు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ చేసారు. వాటికి శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నాల్గవ పాటని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. రేజ్ ఆఫ్ భోలా - మెగా ర్యాప్ గీతం పేరుతో త్వరలో విడుదల కానుంది ఈపాట. దీన్ని టీజర్ అండ్ ట్రైలర్ లో రివీల్ చేసారు.
మరి ఈ గీతాన్ని రచించింది ఎవరో తెలుసా? దర్శకుడు మెహర్ రమేష్- ఫిరోజ్ ఇజ్రాయల్ సంయుక్తంగా ఈ పాటని రచించారు. ఈ పాట విడుదల తేది ప్రకటించాల్సి ఉంది. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో? చూడాలి. ఇప్పటివరకూ మెహర్ రమేష దర్శకుడిగానే సుపరిచితుడు.
యాక్షన్ చిత్రాల్ని తనదైన శైలి లో తెరకెక్కించడంలో స్పెషలిస్ట్. అయితే ఆయన వైఫల్యాలు దర్శకుడిగా రేసులో వెనక్కి నెట్టాయి. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి భోళా శంకర్ కి అవకాశం కల్పించారు. ఈ సినిమా విజయంతో రేసు లోకి రావాల ని రమేష్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనేపత్యంలోనే ఆయనలో రైటర్ కూడా బయట కు తన్నుకుంటూ వచ్చాడు.