మెహరీన్… ఎన్నాళ్ళకి మళ్ళీ ఇలా..

ఇలా వరుస విజయాలు రావడంతో మెహరీన్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

Update: 2024-12-11 15:55 GMT

'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో 2016లో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మెహరీన్ పిర్జాదా. ఈ పంజాబీ ముద్దుగుమ్మ మొదటి చిత్రంతోనే సక్సెస్ అందుకోవడంతో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. తరువాత 'ఫీలౌరి' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. తరువాత తెలుగులో శర్వానంద్ కి జోడీగా 'మహానుభావుడు' మూవీ చేసింది. ఈ సినిమా సక్సెస్ అయ్యింది. 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజతో జతకట్టి బ్లాక్ బస్టర్ అందుకుంది.



ఇలా వరుస విజయాలు రావడంతో మెహరీన్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, పంజాబీ భాషలలో వరుసగా మూవీస్ చేసింది. అయితే తెలుగులోనే ఆమె ఎక్కువ అవకాశాలు అందుకుంది. అయితే తరువాత ఆమెకి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. 'ఎఫ్ 3'తో ఆమె చివరిగా హిట్ అందుకుంది. గత ఏడాది 'స్పార్క్' అనే మూవీలో కొత్త హీరోతో జత కట్టింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఇప్పటి వరకు మెహరీన్ నుంచి కొత్తసినిమా ప్రకటనలు ఏవీ రాలేదు.


కన్నడంలో ఒక సినిమా చేస్తోన్న అది కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. చేతిలో సినిమాలు లేకపోవడంతో మెహరీన్ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఈ ఫ్రీ టైంలో హ్యాపీగా నచ్చిన దేశాలు ఈ అమ్మడు తిరిగేస్తోంది. తాజాగా థాయ్ లాండ్ లో గ్రీన్ ఎలిఫెంట్ అభయారణ్యం పార్క్ లో ఏనుగుతో కలిగి దిగిన ఫోటో, వీడియోని మెహరీన్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.


ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ స్కర్ట్స్ లో చాలా స్లిమ్ గా క్రేజీ లుక్స్ తో ఈ అమ్మడు కట్టిపడేస్తోంది. ఈ ఫోటోలు చూస్తుంటే నేచర్ ని ఈ అమ్మడు బాగా ఆశ్వాదిస్తోన్నట్లు కనిపిస్తోంది. అయితే మెహరీన్ ని మరల వెండితెరపై చూడాలని ఆమె ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. మరి 2025లో అయిన కొత్త సినిమా స్టార్ట్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News