కత్రినతోనా.. అతిథి పాత్రలోనా? అనడిగారు
పబ్లిక్ తన విషయంలో వ్యంగ్యంగా స్పందించిన ఒక సందర్భాన్ని తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గుర్తు చేసుకున్నారు
పబ్లిక్ తన విషయంలో వ్యంగ్యంగా స్పందించిన ఒక సందర్భాన్ని తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గుర్తు చేసుకున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కత్రినతో సినిమా చేస్తున్నాను అనగానే, అతిథిగా నటిస్తావా? నాయికా ప్రధాన చిత్రమా? అని తనను అడిగినట్టు తెలిపారు. కత్రినా కైఫ్- విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన 'మెర్రీ క్రిస్మస్' శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సేతుపతి మాట్లాడుతూ.. మెర్రీ క్రిస్మస్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ సరసన నటించడంపై ప్రజలు మొదట్లో ఎలా స్పందించారో వెల్లడించాడు. ''అందరికీ అలాంటి సందేహం వచ్చింది... నేను షాక్ అయ్యాను'' అని సేతుపతి అన్నారు.
నేను శ్రీరామ్ రాఘవన్ సర్ సినిమా చేస్తున్నానని మొదట చెప్పినప్పుడు ఓకే, చాలా బాగుంది.. సూపర్బ్ అన్నారు. అప్పుడు నేను కత్రినా కైఫ్‌తో సినిమా చేస్తున్నాను.. అన్నాను. మీది గెస్ట్ రోల్ కదా.. హీరోయిన్ సెంట్రిక్ ఫిలిమా..? అని తనను కొందరు ప్రశ్నించినట్టు సేతుపతి తెలిపారు. కత్రినా అంటే అందరిలో ఫేమస్.. అందువల్ల నాకు కూడా షాక్ తగిలింది. సినిమాలో ఎలా ఉండబోతుందో అని అందరూ అడిగేవారు. అదే విషయంపై నాకు కూడా భయం సందేహం ఉన్నాయి'' అన్నారు.
మెర్రీ క్రిస్మస్ ఇటీవల విడుదలై విమర్శకుల నుండి అద్భుతమైన సమీక్షలను పొందింది. కత్రినా కైఫ్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ తో ఆకట్టుకుంది. కత్రిన సహనటుడిగా విజయ్ సేతుపతి తన హృదయంలో మనస్సులో రణరంగం తన చుట్టూ ఎగసిపడుతున్న తుఫానును అర్థం చేసుకోవడానికి కేవలం మాటల కంటే తన కళ్ళు ముఖ కవళికలపై ఎక్కువగా ఆధారపడేవాడిగా కనిపించాడు. ఇది కత్రినకు పెద్ద సాయమైంది. మెర్రీ క్రిస్టమస్ జనవరి 12న తమిళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. రెండు భాషల్లో విభిన్న సహాయ నటులతో చిత్రీకరించిన చిత్రమిది. హిందీ రెండిషన్‌లో సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్ను ఆనంద్ సహాయక పాత్రలు పోషించగా, తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ నటించారు.