స్టార్ వైఫ్ టాటూ వెనక టాప్ సీక్రెట్
మోచేతిపై 'సిరా పాండా' టాటూ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తనలోని ఇన్నర్ చైల్డ్ గురించిన ఆనందం తనలో ప్రస్ఫుటమైంది.
రానా దగ్గుబాటి ఇంటీరియర్ ప్రొఫెషనల్ కం ఈవెంట్ మేనేజర్ మిహీక బజాజ్ ని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంట లైఫ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ప్రతి ఫోటో అభిమానుల్లో వైరల్ అయ్యాయి. మిహీకా బజాజ్ హైదరాబాద్ బజాజ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తల్లి బంటీ -తండ్రి సురేష్ బజాజ్ 'క్రిసాలా ఆభరణాలు' అనే కోచర్ జ్యువెలరీ బ్రాండ్ స్థాపకులు. మిహీకా బజాజ్ ఇంటీరియర్ డెకర్ .. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ చేస్తున్నారు. 2020 ఆగస్టులో హైదరాబాద్ లో కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో రానా దగ్గుబాటి- మిహీకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
పెళ్లి తర్వాత మిహీకా బజాజ్ తమ కుటుంబ వేడుకలు సహా ఎన్నో వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారు. తన తల్లిదండ్రులు, భర్తతో కలిసి ప్రయాణాలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసారు. ఇటీవలి ఓ పోస్ట్‌లో మిహీకా మోచేయి పై ఉన్న పచ్చబొట్టును బహిర్గతం చేసింది. మోచేతిపై 'సిరా పాండా' టాటూ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా తనలోని ఇన్నర్ చైల్డ్ గురించిన ఆనందం తనలో ప్రస్ఫుటమైంది. మిహీక ఎల్లపుడూ పచ్చబొట్లు ఎంపిక సంప్రదాయ పేర్ల నుండి వేరుగా ఉంటుంది. అందమైన ప్రేమతో నిండిన కార్టూన్లను టాటూలుగా ఎంచుకుంటుంది. క్యూట్ పాండా ఎంపిక తన ప్రత్యేకతను ఆవిష్కరించింది.
ఇక తన భార్యపై ఎంతటి ప్రేమాభిమానాలు ఉన్నాయో ఇదిగో ఈ ఫోటోలో రానా ఎఫెక్షన్ చూస్తుంటే అర్థమవుతోంది. రానా నటిస్తున్న తదుపరి సినిమా గురించి అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. తమిళంలో భారీ మల్టీస్టారర్ లో అతడు నటిస్తున్న సంగతి తెలిసిందే. హిరణ్య కసిప సహా పలు భారీ చిత్రాల గురించిన అప్ డేట్స్ రావాల్సి ఉంది.