పుష్ప 2 పై నోరు జారిన సిద్ధార్థ్.. గాయ‌కుడి కౌంట‌ర్!

ప‌లువురు సెల‌బ్రిటీలు పుష్ప‌రాజ్ హ‌వా గురించి పొగిడేశారు.

Update: 2024-12-11 17:03 GMT

'పుష్ప 2: ది రూల్' దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే వెయ్యి కోట్ల గ్రాస్ ని క‌లెక్ట్ చేసింది. చాలామంది సోష‌ల్ మీడియాల్లో పుష్ప 2 పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప‌లువురు సెల‌బ్రిటీలు పుష్ప‌రాజ్ హ‌వా గురించి పొగిడేశారు. అయితే అందుకు భిన్నంగా హీరో సిద్ధార్థ్ ఇటీవల కొన్ని కామెంట్లు చేసారు.

అయితే సిద్ధార్థ్ వ్యాఖ్యలకు గాయకుడు మికా సింగ్ కౌంట‌ర్ వేసారు. తన ఇన్‌స్టాలో సిద్ధార్థ్ స్టేట్‌మెంట్‌ను మళ్లీ షేర్ చేస్తూ మికా వ్యంగ్య వ్యాఖ్యను రాశారు. ఆ వ్యాఖ్య సోష‌ల్ మీడియాల్లో అతడి స్థాయిని పెంచుతోంది. సిద్ధార్థ్ తన ఇన్‌స్టాలో పుష్ప 2 గురించి చెప్పిన విషయాలను మికా మళ్లీ షేర్ చేసి ఇలా వ్యాఖ్యానించారు. హలో సిద్ధార్థ్ మీ అసంబ‌ద్ధ‌మైన‌ కామెంట్ నుండి బయట ప‌డ‌టానికి ఒక మంచి విషయం ఉంది. ఈ రోజు నుండి ప్రజలు మీ పేరు కొంచెం తెలుసుకుంటారు..ఒక్కసారి ఆలోచించండి.. మీరు ఏం చేస్తారో నాకు కూడా తెలియదు!'' అని కౌంట‌ర్ వేసాడు.

సిద్ధార్థ్ ఏమ‌ని కామెంట్ చేసాడు?

తన చిత్రం 'మిస్ యు'ను ప్రమోట్ చేస్తున్నప్పుడు సిద్ధార్థ్ మాట్లాడుతూ..''ఇది పుష్ప 2: ది రూల్‌తో పోటీప‌డి రిలీజ్ కావాల్సిన‌ది. కానీ వాయిదా పడింది... ఈ సినిమా ప్ర‌చార ఈవెంట్ల‌లో జ‌న సందోహం గురించి సిద్ధార్థ్ మాట్లాడాడు. ''అదంతా మార్కెటింగ్. భారతదేశంలో జనాన్ని పోగేయ‌డం పెద్ద విషయం కాదు. మీరు నిర్మాణం కోసం జేసీబీ తీసుకురండి.. జనాలు ఆటోమేటిక్‌గా గుమిగూడుతారు. కాబట్టి బీహార్‌లో జనం రావడం పెద్ద విషయం కాదు'' అని కామెంట్ చేసాడు. నిజానికి సినిమా లో నాణ్య‌త‌కు .. ఈవెంట్లలో జ‌నసందోహానికి సంబంధం లేద‌ని అన్నాడు.

అతను 'పుష్ప 2' ఈవెంట్ లో జ‌నాల‌పై వ్యాఖ్యానిస్తూ.. వారిని బిర్యానీ ఆల్కహాల్ పంపిణీ చేస్తే వ‌చ్చే గుంపుతో పోల్చాడు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో గుమికూడడానికి, సినిమా నాణ్యతకు మధ్య ఎటువంటి సంబంధం లేదు. అదే జరిగితే అన్ని రాజకీయ పార్టీలు గెలిచినట్టే. మా రోజుల్లో ఈ జనాలు బిర్యానీ, క్వార్ట‌ర్ (మద్యం) తెచ్చుకునేవారు.. అని కామెంట్ చేసాడు.

Tags:    

Similar News