మిరాయ్ బడ్జెట్ మించుతున్నాడా..?

ఐతే మేకర్స్ మాత్రం సినిమా బడ్జెట్ పెరిగినా కంటెంట్ అదిరిపోతుంది కాబట్టి వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

Update: 2024-12-31 04:01 GMT

హనుమాన్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న యువ హీరో తేజా సజ్జా తన సినిమాల ప్లానింగ్ తో సూపర్ అనిపించుకుంటున్నాడు. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తేజా సజ్జా సినిమాలు ప్రేక్షకులకు కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తున్నాయి. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న అతను వరుస ఛాన్సులు రాగా అందులో మళ్లీ పర్ఫెక్ట్ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా మళ్లీ పాన్ ఇండియా కథలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు తేజా సజ్జ.

ప్రస్తుతం అతను కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో మిరాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో మిరాయ్ చూస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే అదిరిపోగా చూస్తుంటే ఇది కూడా తేజా సజ్జాకు మరో సూపర్ హిట్ ఇచ్చేలా ఉంది. ఐతే ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. అనుకున్న దాని కన్నా మిరాయ్ బడ్జెట్ కాస్త పెరిగిందని చెప్పుకుంటున్నారు. సినిమాకు సెట్స్ మీద అనుకున్న బడ్జెట్ ఒకటి కాగా ఇప్పుడు పెడుతున్న బడ్జెట్ కి కొంత వ్యత్యాసం ఉందని అంటున్నారు.

ఐతే మేకర్స్ మాత్రం సినిమా బడ్జెట్ పెరిగినా కంటెంట్ అదిరిపోతుంది కాబట్టి వర్క్ అవుట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. హనుమాన్ సక్సెస్ తో తేజా సజ్జా సినిమాకు నార్త్ లో డిమాండ్ బాగానే ఉంది. మిరాయ్ టీజర్ కూడా అంచనాలు పెంచడంతో సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుంది. ఆ ధైర్యంతోనే నిర్మాతలు బడ్జెట్ కాస్త ఎక్కువైనా ఓకే అనేస్తున్నారట. ఈ సినిమాలో మరో స్పెషల్ ఎట్రాక్షన్ మంచు మనోజ్ విలన్ గా చేయడమే. మంచు హీరో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ చేస్తున్న సినిమా కాబట్టి అలా కూడా మిరాయ్ కి కలిసి వచ్చేలా ఉంది.

సో మిరాయ్ అన్ని మంచి శకునములే అన్నట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాతో కూడా తేజ సజ్జా హిట్ కొడితే హీరోగా అతను కూడా కెరీర్ స్ట్రాంగ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కార్తీక్ ఘట్టమనేని ఈ ఇయర్ ఈగల్ తో వచ్చినా ఆ సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు. ఐతే మిరాయ్ మాత్రం టార్గెట్ ఏమాత్రం మిస్ అవ్వదని అంటున్నారు. తేజా సజ్జా మిరాయ్ సినిమాను 2025 ఏప్రిల్ 18న రిలీజ్ లాక్ చేశారు. మరి అనుకున్న టైం కు సినిమా వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News