బూతు సిరీస్ సీజన్ 3 కొత్త అప్డేట్
ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల్లో అత్యధికులకు సుపరిచితం అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్
ఇండియన్ ఓటీటీ ప్రేక్షకుల్లో అత్యధికులకు సుపరిచితం అయిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఇప్పటి వరకు రెండు సీజన్ లు వచ్చిన మీర్జాపూర్ మూడో సీజన్ కి సిద్ధం అయ్యింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ అతి త్వరలోనే ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మీర్జాపూర్ స్ట్రీమింగ్ అయిన ప్రతి సారి ఒక వర్గం ప్రేక్షకులు తీవ్రంగా విమర్శలు గుప్పించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వెబ్ సిరీస్ లకు సెన్సార్ అవసరం అని, యువత చెడి పోయే విధంగా ఈ వెబ్ సిరీస్ ఉంటుంది అంటూ వారు ఆందోళన చేయడం మనం చూస్తూనే ఉన్నాం.
బూతు వెబ్ సిరీస్ అంటూ మీర్జాపూర్ కి ఇప్పటికే పేరు పడి పోయింది. అలాంటి బూతు వెబ్ సిరీస్ మూడో సీజన్ కి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అన్నట్లుగా సోషల్ మీడియాలో జులై నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది.
మీర్జాపూర్ గత రెండు సీజన్ లతో పోల్చితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా హింస మరియు బూతు ఉంటుందని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం నిజం అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే మీర్జాపూర్ ను చూసే ప్రేక్షకులు అంతకు మించి వినోదాన్ని ఆశిస్తున్నారు. అందుకే అంతకు మించి బూతు ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్.
తాజాగా గుడ్డూ పండిట్ పోస్టర్ ను విడుదల చేసిన మేకర్స్ స్ట్రీమింగ్ కు సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ జులై లో ఖచ్చితంగా మీర్జాపూర్ సీజన్ 3 ఉంటుందని మాత్రం బాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఈ వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.