మిషన్ ఇంపాజిబుల్ 7: ఇండియాలో ఇది బాక్సాఫీస్ లెక్క!
యాక్షన్ అడ్వెంచర్ రియల్ స్టంట్ సినిమా
యాక్షన్ అడ్వెంచర్ రియల్ స్టంట్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్న టామ్ క్రూజ్ ఈసారి మోస్ట్ సక్సెస్ ఫుల్ అయిన మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission: Impossible - Dead Reckoning Part One) ఏడవ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా జూలై 12వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా పలు ప్రాంతీయ భాషల్లో భారీ స్థాయిలోనే విడుదలైంది.
ఇక ఈ సినిమాకు మొదటి రోజే మంచి టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి. మొదటిసారి టామ్ క్రూజ్ సినిమాకు ఇండియాలో అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ రావడం విశేషం. ఇంతకుముందు మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు కూడా తెలుగులో విడుదలయ్యాయి. కానీ అప్పుడు అంతగా ఓపెనింగ్స్ అయితే రాలేదు.
కానీ ఈసారి మాత్రం ఈ సినిమా కూడా గత హాలీవుడ్ సినిమాల ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 300 మిలియన్ల యూఎస్ డాలర్ బడ్జెట్ తో తెరపైకి వచ్చిన ఈ సినిమా అత్యధిక స్థాయిలో గ్రాండ్ గా విడుదలైంది. ఇక ఈ సినిమాలో ఇండియా లో మొదటి రోజే ఊహించిన విధంగా ఓపెనింగ్స్ అందుకుంది.
మొదటి రోజే ఇండియాలో 12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక తరువాత రెండవ రోజు 9 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ రాగా ఇక మూడవరోజు చూసుకుంటే కూడా దాదాపు 9 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా మొత్తంగా మూడు రోజుల్లో ఇండియా వైడ్ గా 30 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు నార్త్ లోనే ఎక్కువగా క్రేజ్ దక్కింది. అక్కడే దాదాపు 27 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ అందినట్లు సమాచారం. ఇక ఈ వీకెండ్ లో సినిమా తప్పకుండా 50 కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం అయితే ఉంది.
టామ్ క్రూజ్ గత సినిమాల కంటే ఈ సినిమా ఇండియాలో అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకునే అవకాశం అయితే ఉంది. మరి మొత్తంగా ఈ సినిమా ఇంకా ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి. క్రిస్టోఫర్ మెక్‌క్వెరీ దర్శకత్వం వహించిన మిషన్ ఇంపాజిబుల్ 7 పార్ట్ 1కు లోమే బాల్ఫే సంగీతం అందించారు.