టీజ‌ర్ టాక్: బొగ్గు గ‌నుల్లో అక్ష‌య్ వీరోచిత పోరాటం!

తాజాగా ఈ చిత్రానికి 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ' గా మేక‌ర్స్ టైటిల్ మార్చారు. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేసారు

Update: 2023-09-09 05:56 GMT

భార‌త దేశం పేరును కేంద్ర ప్రభుత్వం 'భార‌త్' గా మార్చిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై దేశాన్ని భార‌త్ గా పిలుచుకుంటాం. దీనిపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఉన్న‌ట్లుండి దేశం పేరు ఎందుకు మార్చాల్సి వ‌చ్చింద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూస సినిమా టైటిల్ పేరును కూడా మార్చారు.

తాజాగా ఈ చిత్రానికి 'మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ' గా మేక‌ర్స్ టైటిల్ మార్చారు. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ చేసారు. టీజ‌ర్ ఆద్యంతం ఉత్కంఠ‌ని రేకెత్తిస్తోంది. రాణిగంజ్ కోల్‌ఫీల్డ్‌లో జరిగిన నిజ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తిగా..బొగ్గు గ‌నుల రెస్క్యూ మిష‌న్ కి నాయ‌క‌త్వం వ‌హించిన దివంగ‌త శ్రీ జ‌స్వంత్ సింగ్ గిల్ వీరోచిత క‌థ‌ని తెర‌పై చూపించ‌బోతున్నారు.

జ‌స్వంత్ పాత్ర‌లో అక్ష‌య్ కుమార్ పోషిస్తున్నారు. టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే థ్రిల్ చేసే స‌న్నివేశా లెన్నోన్నా యి. బొగ్గు గ‌నుల్లో వాతావ‌ర‌ణం ఎలా ఉంటుంది? అక్క‌డ ప్ర‌మాదాలు ఎలా ఉంటాయి? ప్ర‌మాదం సంభవించిన స‌మ‌యంలో కార్మికులు ఎలాంటి భ‌యాందోళ‌న‌కు గుర‌వుతారు? జ‌స్వంత్ సింగ్ ప్రాణాల‌కు తెగించి వాళ్ల‌ని ఎలా కాపాడారు? అన్న‌ది చిన్న టీజ‌ర్ లో క‌ళ్ల‌కు క‌ట్టారు. సినిమా అంతా ప్ర‌త్యేక‌మ‌మైన బొగ్గు గ‌నుల సెట్లు వేసి తెరకెక్కించారు. టీజర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది.

నవంబరు 1989లో రాణిగంజ్‌లో వరదల్లో చిక్కుకున్న బొగ్గు గనిలో చిక్కుకుపోయిన మైనర్లను రక్షించ డంలో జస్వంత్ సింగ్ గిల్ కీలక పాత్ర పోషించారు. ఇది భారత్ చరిత్రలో గొప్ప‌ విజయవంతమైన రెస్క్యూ మిషన్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, రవి కిషన్, వరుణ్ బడోలా, దిబ్యేందు భట్టాచార్య, ముఖేష్ భట్, ఓంకార్ దాస్ మాణిక్‌పురి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసి అక్టోబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Full View
Tags:    

Similar News