స్టార్ యాక్టర్ పర్స్ మాయం.. రిక్వెస్ట్ చేసినా ఫలితం లేదు
స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన మిథున్ చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది.
పబ్లిక్ మీటింగ్స్ కు వెళ్లిన సమయంలో సామాన్య జనాల పర్స్ లు, మొబైల్ ఫోన్స్ పోవడం కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అదే సమయంలో ఎక్కువ మంది జనాల మధ్య సెలబ్రెటీలు ఉన్న సమయంలో వారి జేబులు ఖాళీ చేసే దొంగలు ఉంటారు. సెలబ్రిటీల పర్సులు కొట్టేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇటీవల మరో స్టార్ నటుడి పర్స్ కొట్టేసి దొంగలు ఉడాయించారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంపీ అయిన ఆ నటుడి పర్స్ పోవడంతో పోలీసులు ఏం చేస్తున్నారు, ఎంపీ గారికి సెక్యూరిటీ ఇవ్వకుంటే సామాన్య జనాలకు పోలీసులు ఎలా సెక్యూరిటీ ఇస్తారు, వారి వస్తువులు ఎలా కాపాడుతారు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.
సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే... బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు మిథున్ చక్రవర్తి త్వరలో జరగబోతున్న ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్టార్ క్యాంపెయినర్‌గా ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన మిథున్ చక్రవర్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రచారం ముగించుకుని వెనక్కి వెళ్తున్న సమయంలో తన పర్సు ఎవరో కొట్టేసినట్లుగా గుర్తించాడు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన ఎంపీ మిథున్ చక్రవర్తి మళ్లీ మైక్ ముందుకు వెళ్లి తన పర్స్ ఎవరో కొట్టేశారు, దాన్ని వెనక్కు ఇవ్వాలంటే చాలా సమయం రిక్వెస్ట్ చేయడం జరిగింది.
పర్స్‌లో ముఖ్యమైన కాగితాలు ఉన్నాయని, డబ్బులు ఎక్కువ లేవని, తన పర్స్ ను వెనక్కి తెచ్చిన వారికి డబ్బు బహుమానంగా ఇస్తానంటూ మిథున్ చక్రవర్తి మైక్ ద్వారా చాలా సమయం విజ్ఞప్తి చేసినా దొంగిలించిన దొంగ మాత్రం ఆ పర్స్ ను వెనక్కి ఇవ్వలేదు. ఆ పర్స్ వెనక్కి ఇస్తే అతడిని పోలీసులు అరెస్ట్ చేస్తాడని తెలిసి ఉంటుంది. అందుకే అతడు తిరిగి పర్స్ ఇచ్చేందుకు వచ్చి ఉండడు. జనాల్లోకి వెళ్లినప్పుడు పర్స్ తో పాటు మొబైల్ ఫోన్‌లు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఇప్పటికైనా సెలబ్రెటీలు గుర్తు పెట్టుకోవాలి.
మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. హిందీ ప్రేక్షకుల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ మంచి ఆధరణ దక్కించుకున్న మిధున్ చక్రవర్తి సుదీర్ఘ కాలంగా రాజకీయాలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. మిథున్ చక్రవర్తి రాజ్యసభ సభ్యుడిగా దేశానికి సేవ చేస్తాడనే నమ్మకంతో మోడీ ప్రభుత్వం ఎంపీగా చేయడం జరిగింది. మిథున్ చక్రవర్తి ఈ వయసులోనే నటించేందుకు సిద్దమే అంటూ గతంలో పలు సార్లు మీడియా ముందు చెప్పారు.