సూపర్ స్టార్ తో కలెక్షన్ కింగ్.. స్నేహమంటే ఇదేరా..

టాలీవుడ్ లో విలన్ గా, హీరోగా తనదైన విలక్షణ నటనతో మెప్పించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు మంచు మోహన్ బాబు.

Update: 2024-07-05 07:46 GMT

టాలీవుడ్ లో విలన్ గా, హీరోగా తనదైన విలక్షణ నటనతో మెప్పించి ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు మంచు మోహన్ బాబు. వయస్సు పెరిగిన ఇప్పటికి నటుడిగా తాను మాత్రమే చేయగలిగే పాత్రలని ఎంపిక చేసుకొని మోహన్ బాబు మూవీస్ చేస్తున్నారు. అలాగే ఈ క్యారెక్టర్ మోహన్ బాబు మాత్రమే చేయగలదని కొంతమంది దర్శకులు ఏరికోరి మరి అతనిని తమ సినిమాల కోసం ఎంపిక చేసుకుంటున్నారు.

గతంలో మాదిరి స్పీడ్ గా మూవీస్ చేయకున్న అడపాదడపా డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మోహన్ బాబు మెప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మంచు విష్ణు లీడ్ రోల్ చేస్తోన్న కన్నప్ప సినిమాలో మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ అయిన మోహన్ బాబు చాలా విషయాల మీద రియాక్ట్ అవుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలిచిన సందర్భంగా ఆయనకి కంగ్రాట్స్ చెప్పారు.

అలాగే కల్కి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉంటే తాజాగా మోహన్ బాబు సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోటోకి మోహన్ బాబు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అప్పుడు… ఇప్పుడు… ఎప్పుడైనా స్నేహమేరా జీవితం అనే క్యాప్షన్ ని మోహన్ బాబు ఆ ఫోటోకి పెట్టారు.

ఫోటోలో మోహన్ బాబు, సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కపక్కనే ఫ్లైట్ లో కూర్చొని ఉన్నారు. మోహన్ బాబు భుజం మీద చేయి వేసి సూపర్ స్టార్ రజినీకాంత్ సరదాగా మాట్లాడుతూ కెమెరాకి ఫోజులిచ్చారు. రీసెంట్ గానే వీరిద్దరూ ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోపై భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్, మోహన్ బాబు కెరియర్ ఆరంభంలో కలిసి కొన్ని సినిమాలలో నటించారు.

Read more!

తరువాత పెదరాయుడు మూవీలో కీలక పాత్రలో సూపర్ స్టార్ రజినికాంత్ నటించారు. ఆ పాత్ర సినిమా సూపర్ హిట్ లో భాగం అయ్యింది. ఇదిలా ఉంటే కన్నప్ప సినిమాలో మంచు మోహన్ బాబు పాత్ర చాలా బలంగా ఉంటుందని టాక్. ఈ సినిమాపై మోహన్ బాబు, విష్ణు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు.

Tags:    

Similar News

eac