మోక్షు, తారక్ బాండింగ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Update: 2024-09-06 16:34 GMT

ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎప్పటి నుంచో వారు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిన విషయం తెలిసిందే. నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ నేడు వచ్చింది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మోక్షును సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేయనున్నారు. ఆయన యూనివర్స్ నుంచి రానున్న రెండో సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటించనున్నారు.

ఎస్ ఎల్ వీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి.. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పణలో నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రశాంత్ వర్మ మోక్షు ఫస్ట్ లుక్ ను కూడా తాజాగా షేర్ చేశారు. అందులో బాలయ్య కుమారుడు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. కిర్రాక్ లుక్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ గా మారగా.. మోక్షుకు బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది సెలబ్రిటీలు పోస్టులు పెట్టారు.

వారిలో మరో నందమూరి వారసుడు, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్.. వైరల్ గా మారింది. అంతా దాని కోసమే మాట్లాడుకుంటున్నారు. "పుట్టిన రోజు శుభాకాంక్షలు మోక్షు.. నువ్వు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చినందుకు అభినందనలు! జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత గారి ఆశీర్వాదాలతో పాటు అన్ని దైవిక శక్తులు నీపై ఉంటాయి'' అని ఎన్టీఆర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

మోక్షు ఎంట్రీ పట్ల తారక్ స్పందించడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. తారక్, బాలయ్య మధ్య రిలేషన్ సరిగ్గా లేదని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం అనుకునేలా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. వాటి గురించి ఎవరూ ఎప్పుడూ ఇప్పటి వరకు స్పందించలేదు. అదే సమయంలో ఇప్పుడు తన తమ్ముడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పట్ల తారక్ స్పందించారు.

తన చిన్న కజిన్ పట్ల ప్రేమను చూపించారు. పబ్లిక్ గా తన లవ్ ను షేర్ చేసుకున్నారు. దీంతో ముందు ఏం జరిగినా.. దానిని నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేయకుండా ఉండాలనేలా తారక్ భావించినట్లు తెలుస్తోందని అభిమానులు చెబుతున్నారు. మోక్షుతో తారక్ హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేయనున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. కళ్యాణ్ రామ్ కూడా మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో విష్ చేశారు. మరి ఫ్యూచర్ లో తమ్ముడికి వారెలా సపోర్ట్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News