మోక్షజ్ఞ రెమ్యునరేషన్.. నిజంగా అంత ఇస్తున్నారా?

నందమూరి నటసింహం బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.

Update: 2024-09-11 04:13 GMT

నందమూరి నటసింహం బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలు కాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా సూపర్ హీరో కథాంశంతోనే ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ అసలు స్టోరీ ఏంటనేది బయటకి రాలేదు. అభిమాన్యుడి క్యారెక్టర్ బేస్ చేసుకొని ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కోసం కథని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మోక్షజ్ఞ సినిమాతో ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందంట. మోక్షజ్ఞకి జోడీగా ఈ చిత్రంలో ఎవరిని ఎంపిక చేస్తారనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది.

ఈ చిత్రం కోసం మోక్షజ్ఞకి నిర్మాతలు ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. ప్రస్తుతం ఇదే ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన ఏ ఒక్క హీరో కూడా డెబ్యూ మూవీతో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఒక టైర్ 2 హీరోకి ఇచ్చే రేంజ్ లో మోక్షజ్ఞకి ఈ చిత్రం కోసం రెమ్యునరేషన్ ఇవ్వడం అంటే అది కచ్చితంగా రికార్డ్ అని చెప్పొచ్చు.

అయితే ఈ రెమ్యునరేషన్ పై జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియదు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోక్షజ్ఞ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల శిక్షణ తీసుకున్నారంట. యాక్టింగ్, డాన్స్ పరంగా మంచి టాలెంట్ ఉందనే మాట వినిపిస్తోంది.

మొదటి చిత్రం అయిన మోక్షజ్ఞ నటనతో అందరిని మెస్మరైజ్ చేయడం గ్యారెంటీ అని నందమూరి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఆయన మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే తెరపై చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది. మరి మోక్షజ్ఞకి ఈ మూవీ ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ అండ్ క్రూని ప్రకటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News