దేశంలో క్రేజీ సర్వేలో నం.1 స్టార్లుగా అల్లు అర్జున్, దీపిక
మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్ అనేది వివిధ రంగాలలో భారతీయ ప్రముఖుల ప్రజాదరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి వార్షిక ప్రమాణం
భారతీయ సినీపరిశ్రమ అత్యుత్తమ స్థానానికి ఎదుగుతోంది. ఇలా అభివృద్ధి చెందుతున్న వినోద ప్రపంచంలో ప్రతిభావంతులకు పర్యాయపదాలుగా మారిన కొన్ని పేర్లు చెరగని ముద్ర వేసాయి. ఈ పేర్లలో ప్రముఖ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు ఈసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఏరింది. అమితాబ్ చాలా కాలంగా భారతీయ సినిమాకి మూలస్తంభంగా నిలవగా, బన్ని ఇటీవలే తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా సంచలనం సృష్టించాడు. ఇలాంటి సందర్భంలో దేశంలో ఎక్కువ ఆకర్షణ, ప్రభావం ఉన్న స్టార్లుగా అల్లు అర్జున్ పేరు నం.1 స్లాట్ లో ఉండడం చర్చనీయాంశమైంది. ఆసక్తికరంగా కథానాయికల్లో దీపిక పదుకొనే 10వ సారి సర్వేలో నం.1 స్థానాన్ని దక్కించుకుంది.
మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్ అనేది వివిధ రంగాలలో భారతీయ ప్రముఖుల ప్రజాదరణ ప్రభావాన్ని అంచనా వేయడానికి వార్షిక ప్రమాణం. సినీరంగంలో పలువురు సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే హైలైట్ అయ్యాయి. కథానాయికల్లో దీపికా పదుకొణె 10 సంవత్సరాలుగా ఈ పోల్‌లో నిలకడగా అగ్రస్థానంలో ఉంది. నటిగా తిరుగులేని ప్రభావం చూపిస్తున్న దీపిక 2023లో జరిగిన MOTN పోల్‌లో దీపికా 25 శాతం ఓట్లను సాధించి భారతదేశానికి చెందిన అత్యంత ప్రభావవంతమైన స్టార్‌గా తన స్థానాన్ని నిరూపించుకుంది. దీపిక ఈ ఏడాది కూడా నెం.1 స్థానంలో ఉంది. అది కూడా ఓటింగ్ పరంగా చూస్తే భారీ తేడాతో తన హవా సాగించింది. 10 శాతం ఓట్లతో కత్రినా కైఫ్, 9 శాతం ఓట్లతో అలియా భట్, 7 శాతం ఓట్లతో ప్రియాంక చోప్రా జోనాస్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ లు నెం.2గా స్థానంలో నిలిచారు.
మరోవైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ 27 శాతం, షారుక్ ఖాన్ 22 శాతం, అక్షయ్ కుమార్ 9 శాతం, సల్మాన్ ఖాన్ 8 శాతం, అల్లు అర్జున్ 6 శాతం ఓట్లతో నెం.1గా నిలిచారు. అమితాబ్ బచ్చన్ ని బాలీవుడ్ షాహెన్‌షా అని అభిమానులు పిలుస్తారు. మూస పద్ధతులను బ్రేక్ చేసి భారతీయ సినిమాని పునర్నిర్వచించిన ఐకానిక్ పాత్రలతో అమితాబ్ పాపులరయ్యారు. దీపికా పదుకొణె కూడా సామాజిక నిబంధనలను సవాలు చేయడానికి, రొటీనిటీ మోనోటనీ నుండి బయటపడటానికి ఇదే విధమైన ధోరణిని అవలంబించింది.
ఇక పుష్పరాజ్ పాత్రతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించాడు. పుష్ప గొప్ప కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడమే గాక, అల్లు అర్జున్ పేరు దేశ విదేశాల్లో మార్మోగిపోయింది. ఒకే ఒక్క సినిమాతో జాతీయ అంతర్జాతీయ మీడియాల్లో అతడు చర్చగా మారాడు. అందుకే ఇప్పుడు మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో అతడి పేరు అగ్ర స్థానానికి ఎగబాకింది. ఇంతకుముందు ఈ సర్వేలో అసలు తెలుగు వారి పేర్లను చూడటమే చాలా అరుదు. అలాంటిది రొటీనిటినీ అల్లు అర్జున్ బ్రేక్ చేసాడు.
ఇక మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో దీపిక పేరు వినిపించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కేవలం నటిగా ప్రతిభను కనబరచడం వైవిధ్యమైన ఎంపికలు మాత్రమే కాదు.. డీపీ దాతృత్వ ప్రయత్నాలు, సామాజిక కార్యక్రమాలు, వినోద పరిశ్రమలో గౌరవప్రదమైన ఉనికికి నిజమైన చిహ్నంగా దీపిక మారింది. సమాజంపై సానుకూల ప్రభావం చూపాలనే నిబద్ధత, దేశం తాలూకా సామూహిక స్పృహలో దీపికా పదుకొణె పోషించే బహుముఖ పాత్రను ఈ గుర్తింపు ప్రతిబింబిస్తుంది.