పిక్ టాక్ : అందాల రాక్షసి బికినీ షో

తాజాగా సముద్ర అందాలను చూపిస్తూ, బికినీలో తన అందాన్ని చూపించడం ద్వారా వైరల్‌ అయింది.

Update: 2024-10-02 01:30 GMT

నార్త్‌ లో బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ మౌని రాయ్‌. సుదీర్ఘ కాలం పాటు టీవీ సిరీస్ లు, షో లు చేయడం ద్వారా హీరోయిన్‌ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకున్న మౌనీ రాయ్ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌ లో మోస్ట్‌ పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్ గానే కాకుండా కీలక పాత్రల్లో నటిస్తూ, విలన్ వేషాలు వేస్తూ కన్నులు విందు చేస్తుంది. ఆ మధ్య బ్రహ్మోత్సవం సినిమాలో రాక్షసి పాత్రలో నటించి విలనిజంతో మెప్పించి అందాల రాక్షసి అంటూ పేరు దక్కించుకున్న మౌని రాయ్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది.


తాజాగా సముద్ర అందాలను చూపిస్తూ, బికినీలో తన అందాన్ని చూపించడం ద్వారా వైరల్‌ అయింది. ఈమె వీడియో షేర్ చేయడం తో పాటు, అందులో బికినీతో ఫోటోలకు ఫోజ్ ఇవ్వడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేసిన ఈ అమ్మడికి అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఈ స్థాయి అందంగా ఉన్న మౌనీ రాయ్ ని ఇన్నాళ్లు బాలీవుడ్‌ మిస్ అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటే, ఇప్పటికి అయినా వరుసగా సినిమా ఆఫర్లు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట అందుకు సంబంధించిన స్టిల్స్ వైరల్‌ అవుతున్నాయి.

మౌనిరాయ్‌ ఈమధ్య కాలంలో వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూడు సినిమాలతోనూ మెప్పించింది. వచ్చే ఏడాదిలోనూ ఈమె నటిస్తున్న రెండు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో మరికొన్ని సినిమాలకు సైతం మౌని రాయ్ సైన్ చేసిందని తెలుస్తోంది. ఈ స్థాయిలో వరుసగా సినిమాలు చేస్తున్న మౌని రాయ్ తాజాగా బికినీ అందాలతో మతి పోగొట్టింది. ఇంతటి అందం కేవలం మౌని రాయ్ కే సాధ్యం అన్నట్లుగా ఆమె ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

మౌని రాయ్ నాలుగు పదుల వయసుకు చేరువ అయినా పాతికేళ్ల పడుచు అమ్మాయి అన్నట్లుగానే అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఈమె అందాల ఆరబోత ఫోటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి పాతికేళ్ల పడుచు అమ్మాయిలను సైతం పక్కకు నెట్టే విధంగా చాలా అందంగా బికినీ లో ఫోజ్ ఇచ్చింది. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఈమెకు సరైన ఆఫర్లు రాక పోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తే మరికొందరు మాత్రం ఇకపై అయినా ఈమెకు మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News