సీనియర్ హీరోలకు సినిమా అర్ధమైందా..

ఈ క్రమంలో ఈమధ్య కాలంలో వచ్చిన సీనియర్ స్టార్ హీరోల సినిమాలు వారి రెగ్యులర్ ఫార్మెట్ కి భిన్నంగా అడుగులు వేస్తున్నారు.

Update: 2023-12-10 03:30 GMT

బీభత్సమైన ఫ్యాన్ బేస్.. ఖాతాలో పదుల సంఖ్యలో రికార్డులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి సినిమా చేసినా చెల్లి పోద్ది అనుకునే రోజులు కావివి. సీనియర్ హీరో అయినా సినిమాలో మ్యాటర్ లేకపోతే రెండో రోజుకే థియేటర్ లు ఖాళీగా కనిపిస్తున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలనే ఆదరిస్తున్న క్రమంలో సీనియర్ స్టార్స్ కూడా వారి సినిమాల పంథాని కూడా మార్చుకున్నారు. ఈ క్రమంలో ఈమధ్య కాలంలో వచ్చిన సీనియర్ స్టార్ హీరోల సినిమాలు వారి రెగ్యులర్ ఫార్మెట్ కి భిన్నంగా అడుగులు వేస్తున్నారు.

ఓ విధంగా చెప్పాలంటే తమిళ హీరోలే ఈ పంథా మొదలుపెట్టారు. అక్కడ సీనియర్ స్టార్స్ కమల్, రజినికాంత్ లు ఈ ఏజ్ లో మనం రొమాన్స్, డ్యూయెట్లు వేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని తమ ఏజ్ కి తగిన పాత్రలతో మెప్పిస్తున్నారు. ముందు కమల్ హాసన్ విక్రం సినిమాలో మిడిల్ ఏజ్ రోల్ చేసి అదరగొట్టారు. ఆ తర్వాత రజనీ కూడా జైలర్ సినిమాలో అలానే తన ఏజ్ కి తగిన పాత్రలో కనిపించి వారెవా అనిపించారు.

ఇక ఈ వరుసలో చెప్పుకుంటే తెలుగు సీనియర్ స్టార్స్ లో బాలకృష్ణ తన సినిమాల్లో తన పాత్ర మిడిల్ ఏజ్ లో ఉండేలా చూసుకుంటారు. అంటే బాలయ్య సినిమాలో డ్యుయల్ రోల్ ఉంటే ఒకటి మిడిల్ ఏజ్ మరోటి యంగ్ ఏజ్ అలా చూపిస్తారు. రీసెంట్ గా హిట్ అయిన భగవంత్ కేసరి సినిమాలో కూడా బాలయ్య బాబు మిడిల్ ఏజ్ లో కనిపించి అలరించారు .

నాగార్జున కూడా బంగార్రాజు సినిమాలో మిడిల్ ఏజ్ రోల్ లో కనిపించారు. రాబోతున్న నా సామిరంగ కూడా అలానే ఉంటుందని టాక్. వెంకటేష్ కూడా సైంధవ్ సినిమాలో మిడిల్ ఏజ్ రోల్ తో వస్తున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకోగా రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ లో కాస్త యంగ్ గా కనిపించాలని చూశారు. అయితే వశిష్ట డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో కంటెంట్ తో పాటుగా తన ఏజ్ కి తగిన పాత్రలో కూడా చిరు సర్ ప్రైజ్ చేస్తారని తెలుస్తుంది.

స్టార్ హీరోలం కదా మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని లెక్క మారింది. వారు చేస్తున్న సినిమాలో కూడా కథ ప్రాధాన్యత ఉండేలా అది కూడా కొత్తగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మార్పు టాలీవుడ్ సక్సెస్ రేటు పెంచేందుకు సహకరిస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News