శ్రీదేవి జీవితంపై సినిమా! బోనీ దేనికి వెనకడుగు?
ఇటు తెలుగు అభిమానులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవికి ఉన్న కోట్లాది మంది అభిమానులు నేటికీ సందేహిస్తూనే ఉంటారు.
అతిలోక సుందరి శ్రీదేవి నటిగా అసమాన ప్రతిభతో శిఖరాగ్రాన్ని చేరుకుని ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. అన్ని సినీపరిశ్రమల్లో చెరగని ముద్ర వేసారు. లైఫ్‌లో తన పెళ్లి అత్యంత వివాదాస్పద ఘట్టం. చివరకు దుబాయ్ లోని ఒక స్టార్ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పటికీ అభిమానులకు జీర్ణం కాదు. ఇటు తెలుగు అభిమానులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవికి ఉన్న కోట్లాది మంది అభిమానులు నేటికీ సందేహిస్తూనే ఉంటారు.
అయితే తెరిచి ఉంచిన పుస్తకం లాంటి శ్రీదేవి జీవితకథతో సినిమా ఎందుకు రావడం లేదు? అనేది అభిమానుల హృదయాల్లో జవాబు లేని ప్రశ్న. నిజానికి శ్రీదేవి మరణానంతరం తన జీవితంపై బయోపిక్ లు తీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొందరు రచయితలు పుస్తకాలు రాసేందుకు ముందుకొచ్చారు. కానీ ఇప్పటివరకూ ఒక్క సినిమా కానీ, ఒక్క పుస్తకం కానీ శ్రీదేవి జీవితంపై రానే లేదు. దీనికి కారణం బోనీకపూర్ అందుకు సముఖంగా లేకపోవడమేనని తాజాగా అతడి ప్రకటన చెబుతోంది. ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. తాను బతికుండగా శ్రీదేవి బయోపిక్ తీసేందుకు అనుమతించనని భర్త హోదాలో బోనీకపూర్ ఖరాకండిగా చెప్పేసారు. శ్రీదేవి పూర్తిగా ప్రయివేట్ వ్యక్తి అని, తన జీవితాన్ని పబ్లిక్ చేసేందుకు ఇష్టపడదని షాకుగా చెప్పారు బోనీ. ఏది ఏమైనా కానీ భర్తగా బోనీకపూర్ అనుమతి ఇవ్వనిదే దర్శకనిర్మాతలకు శ్రీదేవి జీవితంపై సినిమా తీసే హక్కు లేదని ప్రజలు భావిస్తున్నారు.