ఈ వారం సినిమాల ప్రీమియర్స్ రెడీ.. ఆ ఇద్దరు మాత్రం..
మూవీ పక్కాగా హిట్ అవుతుంది అన్న గట్టి నమ్మకం ఉంటే రిలీజ్‌కు ముందే ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
గత కొద్ది కాలంగా తెలుగు ఇండస్ట్రీలో ప్రీమియర్స్ ట్రెండ్ కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. మూవీ పక్కాగా హిట్ అవుతుంది అన్న గట్టి నమ్మకం ఉంటే రిలీజ్‌కు ముందే ప్రీమియర్స్ వేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అలా ఆడియెన్స్‌ను ఆకర్షించే ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నారు. తన సినిమాలపై సినీ ప్రియుల్లో హైప్ క్రియేట్ చేసేందుకు మీడియం బడ్జెట్ నిర్మాతలందరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.
777 చార్లీ, రైటర్ పద్మభూషణ్, మేం ఫేమస్, సామజవరగమణ, బేబీ వంటి చిత్రాలు ఇలా ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ తెచ్చుకుని రిలీజ్ తర్వాత మంచి వసూళ్లను అందుకున్నాయి. అయితే ఇలాంటి స్ట్రాటజీని ఫాయి అయిన రంగబలి, హిడింబ లాంటి కొన్ని చిత్రాలు మాత్రం బోల్తా కొట్టాయి. అయితే ఇప్పుడు మరో సినిమా ప్రీమియర్స్‌కు రెడీ అయింది. ఆర్స్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన కొత్త చిత్రం 'బెదురులంక 2012' ఆగస్ట్ 25న రిలీజ్ కానున్న సంగతి తెలిసింది.
కానీ ఇప్పుడీ చిత్రం ఆగస్ట్ 24 గురువారమే థియేటర్లలోకి రానుంది. గుంటూరు, వైజాగ్, కాకినాడ వంటి నగరాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారు. దీనికి ఆన్ లైన్లో బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోన్ని కొన్ని చోట్ల డిమాండ్ బట్టి ఎక్స్ ట్రా షోలకు ప్లాన్ చేయనున్నారట.
2012 యుగాంతం వల్ల ఓ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామాలు ఆధారంగా దర్శకుడు క్లాక్స్ ఈ కామెడీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతవుతున్న కార్తికేయకు ఈ సినిమా హిట్ కావడం ఎంతో ముఖ్యం. అలానే కన్నడ డబ్బింగ్ హిట్ మూవీ బాయ్స్ హాస్టల్‌కు కూడా.. రిలీజ్ ముందు రోజు రాత్రి షోలు ప్లాన్ చేసి టికెట్లను అమ్ముతున్నారట.
ఇక ఈ రెండు చిత్రాలతో పాటు రానున్న 'గాండీవధారి అర్జున', 'కింగ్ అఫ్ కొత్త' సినిమాలు మాత్రం ప్రీమియర్స్‌తో రావట్లేదని తెలిసింది. ఆయన అనుకున్న రిలీజ్ డేట్ 24నే రానున్నారట. వరుణ్ తేజ్ కూడా.. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 25 ఫ్రైడే కోసం వెయిట్ చేస్తున్నారట.