నిర్మాతలకు ఈ భయాలు ఇక తగ్గవా?
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో కొత్త విషయం కనిపిస్తోంది. కాంబినేషన్ చూస్తుంటే చిన్నగా కనిపిస్తోంది
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో కొత్త విషయం కనిపిస్తోంది. కాంబినేషన్ చూస్తుంటే చిన్నగా కనిపిస్తోంది. బడ్జెట్ మాత్రం భారీగా ఉంటోంది. అలా అని ఆదాయం మాత్రం ఎక్కవ రావడం లేదు. అందుకు సాకుగా కాస్ట్ ఫెయిల్యార్ అని చెప్పుకోలేకపోతున్నారు. ఇలా నిర్మాతలంతా ఓ సినిమా తీయాలంటే ఒకటి 20 సార్లు లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. ఇండస్ట్రీలో ఎక్కువ మంది బాధ ఇదే!
నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా.. సీనియర్ హీరోలుయ రూ.కోట్లలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో ఇవ్వకపోతే కుదరదంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు కూడా రూ.25 కోట్ల కావాలంటున్నారు. చేసిన సినిమాలు తక్కువే అయినా రెమ్యునరేషన్ లో తగ్గేదేలే అంటున్నారు. నిర్మాతల బాధలను అటు దర్శకులు గానీ, హీరోలు గానీ అర్ధం చేసుకోవట్లేదట.
ఇలాంటి సమయంలోనే దర్శకులు సరైన కథలు రాసుకుని బడ్జెట్ ను కంట్రోల్ లోకి తీసుకురావాలని సినీ నిపుణులు చెబుతున్నారు. కానీ వారు కూడా వంద కోట్ల బడ్జెట్ అంటున్నారట. దీంతో నిర్మాతలంతా బెంబేలెత్తిపోతున్నారట. కొందరైతే సినిమాలకే దండం పెట్టేస్తున్నారట.
ఇటీవలే మైత్రీ మూవీ మేకర్స్- గోపీచంద్ సినిమాకు ఇదే జరిగిందట. ఆన్ పేపర్ మొత్తం రూ.115 కోట్ల బడ్జెట్ అనగానే నిర్మాతలు వెనకడుగు వేయకతప్పలేదట. పేపర్ మీదే రూ.115 కోట్లు అంటే సినిమా విడుదల నాటికి 130 కోట్లు దాటేస్తుంది. దీంతో ఆ హీరోపై మైత్రీకి అంత నమ్మకం లేక సినిమా ఆపేశారట.
మరోవైపు, చిట్టూరి శ్రీను-నాని సినిమా అనుకున్నారు. డాన్ సినిమా అందించిన సిబీ చక్రవర్తే దర్శకుడు. హీరో రెమ్యూనరేషన్ కాకుండానే రూ.100 కోట్ల బడ్జెట్ చెప్పారట సిబీ చక్రవర్తి. దీంతో మరో కథ చూద్దామని అని నిర్మాత- హీరో ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారట.
ఇంకో సినిమాలో ఇలానే జరిగేటట్టు ఉంది. సీనియర్ హీరో సినిమాకు పేపర్ పై రూ.85 కోట్ల బడ్జెట్ అంటున్నారట దర్శకుడు. కానీ సినిమా నిర్మాణ అనుభవం ఉన్నవారు రూ.100 కోట్ల లోపు పూర్తి కావడం కష్టం అంటున్నారట. మరి నిర్మాత ఏం చేస్తారో చూడాలి మరి. మొత్తానికి హీరోలు, దర్శకులు తమ బడ్జెట్ తో నిర్మాతలను భయపెటేస్తున్నారన్నమాట.