ఈ వారం సినిమాలు.. సెన్సార్లు అలా.. రన్ టైమ్ ఇలా!

ప్రతి వారం లాగే ఈ వీక్ కూడా థియేటర్లలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి / చేస్తున్నాయి.

Update: 2024-09-12 10:01 GMT

ప్రతి వారం లాగే ఈ వీక్ కూడా థియేటర్లలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి / చేస్తున్నాయి. గత వారం దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్- ది గోట్ తో పాటు టాలీవుడ్ హల్క్ రానా నిర్మించిన 35- ఒక చిన్న కాదు, సుహాస్ జనక అయితే గనక మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు సెప్టెంబర్ సెకండ్ వీక్ లో ఫస్ట్.. మాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ ఎ.ఆర్‌.ఎం రిలీజ్ అయింది. నేడే(సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

వేర్వేరు కాలాల్లో జరిగిన ప్రేమ కథలతో వచ్చిన ఎ.ఆర్.ఎం మూవీని డైరెక్టర్ జితిల్ లాల్ తెరకెక్కించారు. కృతిశెట్టి, ఐశ్వర్య రాజేష్, బసిల్‌ జెసెఫ్‌ కీలక పాత్రలు పోషించిన ఆ సినిమా.. 2 గంటలు 23 నిమిషాల రన్ టైమ్ తో వచ్చింది. సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ అందుకుని విడుదల అయింది. అయితే ఈ వారం రిలీజ్ కానున్న మిగతా చిత్రాల పరిస్థితేంటి? సినిమాల రన్ టైమ్ ఎంత? సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్లు జారీ చేసింది?

సెప్టెంబర్ 13వ తేదీన మత్తు వదలరా-2, ఉత్సవం, భలే ఉన్నాడే, కళింగ సినిమాలు రిలీజ్ కానున్నాయి. సూపర్ హిట్ మూవీ 3 రీరిలీజ్ కానుంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో కుమారుడు శ్రీసింహా, కమెడియన్ లీడ్ రోల్స్ లో నటించిన మత్తు వదలరా సీక్వెల్.. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ రిలీజ్ కు సిద్ధమైంది. రితేష్ రానా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్.. రెండు గంటల 19 నిమిషాల రన్ టైమ్ తో విడుదల కానుంది.

రెజీనా, దిలీప్ ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉత్సవం మూవీకి కూడా యూ/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు అధికారులు జారీ చేశారు. ఆ సినిమా రన్ టైమ్ 2 గంటల 20 నిమిషాలుగా ఉండనుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ భలే ఉన్నాడే మూవీ.. 2 గంటల 17 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూ/ఏ సెన్సార్ సర్టిఫికెట్ అందుకుంది. ధృవ వాయు కళింగ మూవీ.. ఏ సర్టిఫికెట్, 2 గంటల నిడివితో రిలీజ్ అవ్వనుంది.

ప్రభుదేవా, నగ్మా లీడ్ రోల్స్ లో వచ్చిన ప్రేమికుడు అప్పట్లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. యూ సర్టిఫికెట్ అందుకున్న ఆ మూవీ.. 2 గంటల 35 నిమిషాల రన్ టైమ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సూపర్ హిట్ మూవీ 3.. సెప్టెంబర్ 14న రీ రీ రిలీజ్ కానుంది. అప్పట్లో యూ సర్టిఫికెట్ అందుకున్న ఆ సినిమా.. 2 గంటల 32 నిమిషాల నిడివితో ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News