సినిమా థియేటర్లకు ఇదే పెద్ద శాపం
ప్రస్తుతం ఇండియన్ సినిమా స్టాండర్డ్ విపరీతంగా పెరిగింది. వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ నిర్మించే స్థాయికి నిర్మాతలు ఎదిగారు
ప్రస్తుతం ఇండియన్ సినిమా స్టాండర్డ్ విపరీతంగా పెరిగింది. వందల కోట్ల బడ్జెట్ తో మూవీస్ నిర్మించే స్థాయికి నిర్మాతలు ఎదిగారు. స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు నిర్మించే సమయంలో వాటిపైన పెట్టిన పెట్టుబడి వీలైనంత తక్కువ సమయంలోనే రాబట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే థియేటర్స్ లో టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 20 రూపాయిలతో మూవీస్ చూసేవారు ఇప్పుడు 60 నుంచి 80 రూపాయిలు పెట్టాల్సి వస్తోంది. మల్టీప్లెక్స్ లో 125 పెట్టి టికెట్ కొనుక్కునే వారు ఇప్పుడు 250 వరకు కొత్త సినిమా కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. సినిమా క్వాలిటీ కోసం పెట్టిన ప్రతి పైసా ఆడియన్స్ నుంచి వసూలు చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయిపోతున్నారు.
అయితే సినిమా నిర్మాణ వ్యయం పెరిగినంత సులభంగా ప్రజల ఆర్ధిక పరిస్థితి వృద్ధి కాలేదు. ఒకప్పుడు వీకెండ్ తో సంబంధం లేకుండా సినిమాలు చూసే ఆడియన్స్ క్రమంగా తగ్గిపోయారు. ఒటీటీలు వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఆగితే ఒటీటీలో చూసుకోవచ్చు అని డిసైడ్ అయిపోతున్నారు. ఎంతో అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు.
ఈ టికెట్ ధరలు ఇప్పుడు నిర్మాతలని ఆర్ధికంగా కుదేలు చేస్తున్నాయి. ఒటీటీల కారణంగా కొంత వరకు సేఫ్ అవుతున్న ఎవరేజ్ టాక్ వచ్చిన కూడా మూవీకి కలెక్షన్స్ రావడం లేదు. కేవలం ఒక్క సూపర్ హిట్ అనిపించుకుంటేనే వసూళ్లు వస్తున్నాయి. లేదంటే వీకెండ్ అయ్యేసరికి థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి. తాజాగా నేషనల్ ఫిల్మ్ డే సందర్భంగా ఏ సినిమా అయిన 99కి మల్టీప్లెక్స్ లో చూడొచ్చు అనే ఆఫర్ పెట్టారు.
దీంతో ఒక్కసారిగా థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. గత ఏడాది కూడా నేషనల్ ఫిల్మ్ డే సందర్భంగా ఒక్క రోజు దేశ వ్యాప్తంగా 6 మిలియన్స్ మంది సినిమాలు చూసారు. దీనిని బట్టి టికెట్ రేటు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అర్ధమవుతోంది. ఇకనైనా నిర్మాతలు టికెట్ ధరల విషయం కాస్తా హెచ్చుతగ్గులు చూపిస్తూ టాక్ బట్టి పెంచడం, తగ్గించడం చేస్తే బెటర్ అనే మాట వినిపిస్తోంది.