రవితేజ 'మిస్టర్ బచ్చన్'.. టీజర్ ఎలా ఉందంటే..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-07-28 13:21 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు త్వరలో మిస్టర్ బచ్చన్ మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది.


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ రైడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న మిస్టర్ బచ్చన్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సాంగ్స్ హైలెట్ అని చెప్పాలి. మిక్కీ మ్యూజిక్, రవితేజ- హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సే రొమాంటిక్ మూవ్స్ ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న వేళ మేకర్స్ మరింత స్పీడ్ గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

రీసెంట్ గా మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తూ.. బచ్చన్ సాబ్ మాస్ మేళా బిగిన్స్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అక్కా నీ మరిది ఎంత వెర్రోడో సాంగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. అదే సమయంలో రవితేజ, భాగ్యశ్రీ లుక్స్ ను రివీల్ చేశారు. సైకిల్ పైకెత్తి ఎత్తుతూ ఇద్దరూ కళ్లల్లో కళ్లు పెట్టుకుని చూసుకుంటూ ఉంటే.. వెనుక అంతా మాట్లాడుకుంటారు. ఇక హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ ఓ రేంజ్ లో ఉంది. ఇద్దరు సరసాలు ఆడుకుంటూ తన ప్రేమను ఎంజాయ్ చేస్తుంటారు.

అదే సమయంలో విలన్ జగపతిబాబు ఇంట్లో ఇన్ కమ్ టాక్స్ రైడ్స్ జరుగుతాయి. రవితేజ ఐటీ ఆఫీసర్ గా రైడ్స్ చేపడతారు. దీంతో ఆయన ఫ్యామిలీని విలన్ టార్గెట్ చేస్తారు. అప్పుడు రవితేజ రంగంలో దిగి దుమ్ముదులిపేస్తారు. సక్సెస్, ఫెయిల్యూర్ ఇంటికొచ్చిన చుట్టాల్లాంటివి.. వస్తుంటాయి, పోతుంటాయి.. అంటూ డైలాగ్ తో రవితేజ అదరగొట్టారు. చివరలో విలన్ హీరోకు దండం పెట్టిన సీన్ ఓ రేంజ్ లో ఉంది. మొత్తానికి టీజర్ మాస్, క్లాస్ టచ్చెస్ తో సినిమాపై ఆసక్తి పెంచుతోంది.

రవితేజ మాస్ యాక్షన్ వేరే లెవల్ ఉంది. భాగ్యశ్రీ తన లుక్స్ అండ్ రొమాన్స్ తో క్యూట్ గా ఆకట్టుకుంది. హరీష్ శంకర్ మార్క్ ఫుల్ గా కనిపించింది. జగపతి బాబు ఎప్పటిలానే అదరగొట్టారు. మొత్తానికి టీజర్.. ఆద్యంతం మెప్పిస్తూ సాగుతోంది. సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ హిట్ పక్కా అనేలా టీజర్ ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News