మృణాల్ అల్ట్రా గ్లామర్.. ఆ డ్రెస్సుకే అందం వచ్చింది

అయితే ఆ తరువాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.

Update: 2024-09-28 11:00 GMT

సీతారామం మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అందాల భామ మృణాల్ ఠాకూర్, ఈ బ్యూటీ మొదటి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్‌కు అభిమానులుగా మారారు. ఇటీవల, హాయ్ నాన్న సినిమాతో మరోసారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించి, రెండో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆ తరువాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ మాత్రం డిజాస్టర్ అయ్యింది.


ఇక టాలీవుడ్‌లో ఎక్కువగా మృణాల్‌ని పెర్ఫార్మెన్స్ పరంగా ట్రెడిషన్ అమ్మాయిలా బేస్డ్ క్యారెక్టర్స్‌లో చూస్తున్నాం. కానీ, రియల్ లైఫ్‌లో ఆమె పూర్తి భిన్నంగా ఉంటుంది. మృణాల్ ఠాకూర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యేవారికి ఆమె అల్ట్రా మోడ్రన్ లుక్‌తో కనిపిస్తుందనే విషయం తెలిసిందే.


బాలీవుడ్‌లో కూడా ఆమె ఎక్కువగా బోల్డ్ పాత్రల్లో కనిపిస్తుంది. అలాగే కంటెంట్ బేస్డ్ కథలు బాలీవుడ్‌లో మృణాల్‌కి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో పూజా మేరీ జాన్ అనే సినిమా ఉంది. దీనితో పాటు, తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని సమాచారం. కోలీవుడ్ ఎంట్రీ కూడా దాదాపు ఖాయమని వినిపిస్తోంది.


మృణాల్‌ఠాకూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా గ్లామర్ ఫోటోషూట్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. ఫ్యాషన్ ఈవెంట్స్‌లో మోడ్రన్ అవుట్‌ఫిట్‌లతో మృణాల్ సందడి చేస్తోంది. ఈ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ట్రెడిషనల్, క్యాజువల్ అవుట్‌ఫిట్స్ మృణాల్ ఠాకూర్ అందానికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయనే కామెంట్స్ వస్తున్నాయి.


తాజాగా, మృణాల్ ఠాకూర్ ఐఫా ఈవెంట్ లో ఎల్లో కలర్ డ్రెస్ లో కనిపించింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. ఈ అవుట్‌ఫిట్‌లో ఆమె నవ్వుతో అందంగా కనిపిస్తోంది. చెవులకు మ్యాచింగ్ బుట్టలు ధరించి, గ్లామర్ కు నిలువెత్తు రూపంలా మృణాల్ ఠాకూర్ చూపరులను ఆకట్టుకుంటోంది.

Tags:    

Similar News