ప్రభాస్ 'స్పిరిట్'లో మృణాల్..!
బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉన్న మృణాల్ ఠాకూర్ అయితే స్పిరిట్‌కి పాన్ ఇండియా మూవీ అనే అప్పీల్ వస్తుంది అనే అభిప్రాయంతో మేకర్స్ ఉన్నారు.
ప్రభాస్ ఇటీవల 'సలార్', 'కల్కి 2898 ఏడీ' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' సినిమాను చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే.
వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను ప్రారంభించి అతి త్వరలోనే సినిమాను పూర్తి చేస్తామని, 2026లో సినిమాను విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఆ మధ్య రష్మిక మందన్నతో చర్చలు జరిగాయి అన్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ అయితే ప్రభాస్‌కి సరి జోడీ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకే దర్శకుడు సందీప్ వంగ ఆమెను ఎంపిక చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా స్పిరిట్ సినిమాను రూపొందిస్తున్నారు. యానిమల్ సినిమాతో ఏకంగా రూ.1000 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్‌తో అంతకు మించి అన్నట్లుగా వసూళ్లు సొంతం చేసుకునే విధంగా సినిమా ఉంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. మృణాల్ ఠాకూర్ తెలుగులో ఇప్పటి వరకు చేసిన సీతారామం, హాయ్ నాన్న సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయినా మృణాల్ ఠాకూర్ యొక్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అంటూ ఆమె ఫాలోయింగ్ చెప్పకనే చెబుతుంది.
స్పిరిట్ సినిమాను హిందీ నిర్మాత భూషన్ కుమార్ నిర్మించబోతున్నారు. యానిమల్ సినిమాతో బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగకి మంచి ఆధరణ లభించింది. కనుక స్పిరిట్ సినిమాను హిందీ ప్రేక్షకులు దృష్టిలో పెట్టుకుని రూపొందించబోతున్నారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు ఉన్న మృణాల్ ఠాకూర్ అయితే స్పిరిట్‌కి పాన్ ఇండియా మూవీ అనే అప్పీల్ వస్తుంది అనే అభిప్రాయంతో మేకర్స్ ఉన్నారు. ఈ విషయమై అధికారికంగా త్వరలోనే ప్రకటన వస్తుందని అంతా భావిస్తున్నారు.