పిక్ టాక్‌ : 'కల్కి' దివ్య ను చూశారా?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది రెండు వారాల క్రితం వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది

Update: 2024-07-12 10:22 GMT

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొంది రెండు వారాల క్రితం వచ్చిన కల్కి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వెయ్యి కోట్ల వసూళ్లకు చేరువ అయిన ఈ సినిమా లో ఎంతో మంది ప్రముఖ నటీ నటులు గెస్ట్‌ పాత్రల్లో నటించడం ద్వారా సినిమా వెయిట్‌ ని పెంచిన విషయం తెల్సిందే.

వైజయంతి మూవీస్ బ్యానర్ తో మంచి అనుబంధం ఉన్న మృణాల్‌ ఠాకూర్ కల్కి సినిమాలో చిన్నదైన దివ్య పాత్రలో కనిపించింది. మొదట ఆ పాత్ర నిడివి కాస్త ఎక్కువ అనుకున్నప్పటికి నిడివి పెరిగిన కారణంగా తగ్గించారనే వార్తలు వస్తున్నాయి.

డీ గ్లామర్‌ లుక్ లో మృణాల్‌ ను చూసిన ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యారు అనడంలో సందేహం లేదు. సీతారామం, హాయ్‌ నాన్న మరియు ఫ్యామిలీ స్టార్‌ సినిమాల్లో చూసిన మృణాల్‌ కి కల్కి లో చూసిన మృణాల్‌ కి చాలా తేడా ఉందని, నటన విషయంలో కూడా మంచి మార్కులు పొందినట్లుగా సోషల్‌ మీడియాలో టాక్ వినిపిస్తుంది.

అందాల ఆరబోత ఫోటో షూట్స్ తో రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే మృణాల్ ఠాకూర్ ఈసారి కల్కి 'దివ్య' లుక్ ఫోటోతో వైరల్‌ అవుతోంది. కల్కి సినిమా ని ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే దివ్య పాత్ర లో నటించిన మృణాల్‌ ఠాకూర్ కోసం అయినా వెళ్తారేమో చూడాలి.

ఇక మృణాల్‌ ఫ్యామిలీ స్టార్‌ పై చాలా ఆశలు పెట్టుకుని చేసింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం సాధించలేదు. అయినా కూడా మృణాల్ తన పారితోషికంను మరింత పెంచడంతో పాటు, తాను అనుకున్న మరియు నచ్చిన కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తోంది.

Tags:    

Similar News