'కల్కి' గెస్ట్‌ కి బాలీవుడ్‌ లో పెద్ద ఛాన్స్‌

ఆ మధ్య విజయ్‌ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరిచినా కూడా ఆఫర్లకు మాత్రం కొదవ లేదు.

Update: 2024-07-21 07:30 GMT

సీతారామం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మృణాల్‌ ఠాకూర్‌. తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుంది. ఆ మధ్య విజయ్‌ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్‌ నిరాశ పరిచినా కూడా ఆఫర్లకు మాత్రం కొదవ లేదు.

ఇటీవలే ఈ అమ్మడు ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో కీలక అతిథి పాత్రలో నటించడం ద్వారా మృణాల్ వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో కనిపించింది కొన్ని నిమిషాలు అయినా కూడా అందరి దృష్టిని మృణాల్ ఆకర్షించింది అనడంలో సందేహం లేదు.

హీరోయిన్‌ గా మృణాల్‌ ప్రస్తుతం సౌత్ లో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో మళ్లీ బాలీవుడ్‌ నుంచి కూడా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకుంటుంది. గతంలో హిందీలో చాలా సినిమాలు చేసిన మృణాల్‌ కి ఒక్కటి కూడా సరైన సక్సెస్ దక్కలేదు.

ఇప్పుడు బాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ క్రేజీ హీరో వరుణ్ ధావన్‌ సినిమాలో నటించే అవకాశం దక్కింది. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌ గా ఎంపిక అవ్వడంతో పాటు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తి అయ్యిందట.

బాలీవుడ్‌ లో వరుణ్‌ ధావన్ సినిమాలో నటించే అవకాశం రావడం అనేది ఖచ్చితంగా పెద్ద అవకాశం. ఆ సినిమా హిట్ అయితే కచ్చితంగా మృణాల్ కి హిందీలో మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు రావచ్చు. మరో వైపు తెలుగు మరియు తమిళంలో ఈ అమ్మడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

Tags:    

Similar News