360 డిగ్రీల్లో తిప్పేస్తున్నావ్ గా అమ్మ‌డు!

డిజైన‌ర్ దుస్తుల ఎంపిక‌లో మృణాల్ మాత్రం సంథింగ్ స్పెష‌ల్ అనే అనాలి. మిగ‌తా భామ‌లకు కొంచెం భిన్న‌మైన దుస్తులు..భంగిమ‌ల‌తో ఆక‌ట్టుకుంటుంది.

Update: 2024-01-16 00:30 GMT

మ‌రాఠీ అందం మృణాల్ బ్యూటీ ని వ‌ర్ణించ‌డ‌మేలా! అమ్మ‌డి బ్యూటీకి ఫిదా కానిది ఎవ‌రు? మృణాల్ బ్యూటీకి లాక్ అవ్వాలంటే అంద‌మైన న‌వ్వు ఒక‌టి చాల‌దా! అంత‌కు మించి చేస్తే ఆ బ్యూటీ దాడిని త‌ట్టు కోగ‌ల‌మా? అవును ఈ వీడియో చూసిన త‌ర్వాత ఈ సందేహం రాక‌మాన‌దు. అమ్మ‌డు ఈ వీడియోలో అంత అందంగా ముస్తాబై క‌వ్వించేస్తుంది మ‌రి. పువ్వ‌ల డిజైనర్ ఔట్ ఫిట్ లో మృణాల్ బ్యూటిని వ‌ర్ణించాలంటే ఆ క‌వులే దిగిరావాలి.


ఈ ఫోటో షూట్ లో అంత అందంగా క‌నిపిస్తుంది. మృణాల్ ముస్తాబైన విధానం...కొంటె చూపులు...క‌ళ్ల‌కు అద్దిన ఐటెక్స్..గాలికి విర‌బూసిన‌ ఆ కురులు..వాటిని చేతుల‌తో అలా నెరుముతూ కెమెరా వైపు చూస్తూ ఇచ్చిన ఫోజుల‌కు ఫిదా కావాల్సిందే. కుర్రాళ్లంతా రౌండ్ ది క్లాక్ 360 డిడ్రీలు తిర‌గాల్సిందే. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. కామెంట్ బాక్సులో మృణాల్ బ్యూటీని ఉద్దేశించి అదే తీరున కామెంట్లు క‌నిపిస్తున్నాయి.


డిజైన‌ర్ దుస్తుల ఎంపిక‌లో మృణాల్ మాత్రం సంథింగ్ స్పెష‌ల్ అనే అనాలి. మిగ‌తా భామ‌లకు కొంచెం భిన్న‌మైన దుస్తులు..భంగిమ‌ల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఎక్కువ‌గా పువ్వుల డిజైన్స్ ఎంపిక చేసుకోవ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. వాటిలో మ‌రింత అందంగా క‌నిపిస్తుంది. వాటిలో ఆ బ్యూటీని ఆ స్వాదించే వారికే ఆ కిక్ దొరుకుతుందన్న‌ది అభిమానుల మాట‌. ఇక మృణాల్ కెరీర్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.


ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. 'సీతారామం' త‌ర్వాత రిలీజ్ అయిన రెండ‌వ సినిమా 'హాయ్ నాన్న‌'తో మంచి విజ‌యం ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. సినిమా క‌మిట్ మెంట్లు...రిలీజ్ లు ఆల‌స్య‌మైనా హిట్ కంటెంట్ తోనే ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. త‌ళుకు బెళుకు రాళ్లు త‌ట్టడేలా..నిక్క‌మైన నీలమొక్క‌టి చాలు అంటూ ముందుకు సాగుతుంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న 'ఫ్యామిలీ స్టార్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News