ప్లాప్ సినిమా తీసి ప్రేక్ష‌కుల‌కే బుర్ర లేద‌న్న డైరెక్ట‌ర్!

ఏ సినిమాకైనా అంతిమంగా తుది తీర్పును నిర్ణ‌యించేది ప్రేక్ష‌కులు మాత్ర‌మే.

Update: 2024-09-04 06:18 GMT

ఏ సినిమాకైనా అంతిమంగా తుది తీర్పును నిర్ణ‌యించేది ప్రేక్ష‌కులు మాత్ర‌మే. ఎంత గొప్ప డైరెక్ట‌ర్ అయినా? ఎలాంటి క‌థాంశంతో సినిమా చేసినా అది ప్రేక్ష‌కుడికి న‌చ్చి..మంచి వ‌సూళ్లు సాధించి.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ప్ప‌డే ఆ సినిమా ప‌రిపూర్ణంగా స‌క్సెస్ అయిన‌ట్లు. ఏ సినిమాకైనా హిట్.. బ్లాక్ బ‌స్ట‌ర్, యావ‌రేజ్, ఎబౌ ఎవ‌రేజ్, ప్లాప్, అట్ట‌ర్ ప్లాప్ అనే ప‌దాల ఆధారంగా సినిమా స్టేట‌స్ ఏంట‌న్న‌ది అర్ద‌మ‌వుతుంది.

ప్లాప్ సినిమా తీసి గొప్ప సినిమా చేసాన‌ని? ప్రేక్ష‌కుల‌పై రివ‌ర్స్ అయిన వాళ్ల‌ను ఇంత‌వ‌ర‌కూ ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడు చూడాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తుంది. ఇంత‌కు ఎవ‌రా ఘ‌నాపాటి అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. అత‌డు ఎవ‌రో కాదు ముద్స‌ర్ అజీజ్. ఇత‌డు ఇప్ప‌టివ‌ర‌కూ ద‌ర్శ‌కుడిగా నాలుగు సినిమాలు చేసాడు. మ‌రికొన్ని సినిమాల‌కు రైట‌ర్ గాను ప‌నిచేసాడు. ద‌ర్శ‌కుడిగా అత‌డు చేసిన నాలుగు సినిమాలు కూడా బిలో ఎవ‌రేజ్ సినిమాలు.

హిట్ అయిన సినిమా అంటూ ఒకటీ లేదు. ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ తో `ఖేల్ ఖేల్ మే` కూడా అత‌నే తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఫ‌లితం గురించి తెలిసిందే. అక్ష‌య్ కుమార్ ఈ సినిమా హిట్ తోనైనా విమ‌ర్శ‌లు తొల‌గించుకుంటాడ‌ని అంతా భావించారు. కానీ అది ప్లాప్ చిత్రంగా తేలిపోయింది. అయితే ఈ సినిమా ప్లాప్ పై ముద్స‌స‌ర్ వితాండ వాద‌న‌కు దిగాడు. ప్లాప్ కి నేను కార‌ణం కాదు ప్రేక్ష‌కులు అంటూ రివ‌ర్స్ లో ఎక్కేసాడు.

ప్రేక్ష‌కులు మాన‌సికంగా ఎద‌గ‌కపోవ‌డం వ‌ల్లే సినిమా విజ‌యవంతం కాలేద‌న్నాడు. `ఖేల్ ఖేల్ మేకి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత , తెలివితేటలు అవసరమని, చాలా మంది సినీ ప్రేక్షకులకు ఈ రెండు ఉండ‌వ‌ని తాను బ‌లంగా న‌మ్ముతానన్నాడు. క్లిష్ట‌మైన ఇతి వృత్తాంతాల‌ను ప్రేక్ష‌కులు అర్దం చేసుకోవ‌డంలో విఫ‌ల మయ్యార‌న్నాడు. దీంతో నెటి జ‌న‌లు అత‌డి తీరుపై మండి ప‌డుతున్నారు. ప్లాప్ సినిమా తీసి ప్రేక్ష‌కుల ది త‌ప్పు అంటావా? ఈయ‌న వితండ వాదిలా ఉన్నాడే? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News