ఈసారి ప్ర‌భాస్- ర‌ణ‌బీర్‌ల గాలి తీసాడు!

ఆదిపురుష్‌లో శ్రీ‌రాముడిగా న‌టించిన ప్ర‌భాస్ గురించి ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ.. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్ర‌జ‌లు ప్ర‌భాస్‌ని అంగీకరించలేదని అన్నారు.

Update: 2024-12-20 00:30 GMT

వ‌రుస‌గా బాలీవుడ్ స్టార్ల‌ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు సీనియ‌ర్ న‌టుడు ముఖేష్ ఖ‌న్నా. శ‌క్తిమాన్ గా సుప్ర‌సిద్ధుడైన స‌ద‌రు న‌టుడు తాను న‌టించిన `శ‌క్తిమాన్` పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్ స‌రిపోడ‌ని సూటిగా చెప్పేశాడు. ఎంత బ‌తిమాలుకున్నా ర‌ణ‌వీర్ కి త‌న శ‌క్తిమాన్ హ‌క్కుల‌ను క‌ట్ట‌బెట్ట‌లేదు. శ‌క్తిమాన్ పాత్ర‌లో అల్లు అర్జున్ మాత్ర‌మే స‌రిపోతాడ‌ని, పుష్ప‌రాజ్ గా అత‌డి న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని, లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌కు స‌రిపోతాడ‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఖ‌న్నా సూచించారు.

తాజాగా మిడ్-డేతో ఇంట‌ర్వ్యూలో క‌పూర్ కుటుంబ హీరో రణబీర్ లార్డ్ రామ్ పాత్రకు స‌రిపోడ‌ని అన్నారు. రాముడు రావ‌ణుడిలా క‌నిపించ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించారు. రామానంద్ సాగర్ రామాయణంలో శ్రీ‌రాముని పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ పౌరాణిక పాత్రకు జీవం పోసాడ‌ని, ప్ర‌జ‌లు అత‌డితో ర‌ణ‌బీర్ క‌పూర్ ని పోల్చి చూస్తార‌ని అన్నాడు. రాముడిగా అరుణ్ గోవిల్ న‌ట‌న‌ గోల్డ్ స్టాండర్డ్‌గా మారింది. నా ప్ర‌కారం.. రామ్‌గా ఎవరు నటించినా రాముడిలా ఉండాలి.. అతడు రావణుడిలా కనిపించకూడదు.. అని అన్నారు.

లార్డ్ రామ్ గా న‌టించే న‌టుడు నిజ జీవితంలో అసభ్యకరమైన పోకిరి అయితే...పార్టీల‌కు వెళ్ల‌డం, మద్యం సేవించ‌డం కుద‌ర‌దు అని అన్నారు. అయితే రామ్ పాత్ర‌లో ఎవ‌రు న‌టించాలో నిర్ణయించడానికి నేను ఎవరు? అని కూడా సంశ‌యించారు. తాను ఎవ‌రినైనా అంటే తిడ‌తార‌ని, త‌ప్పుగా అర్థం చేసుకుంటార‌ని కూడా ముఖేష్ జీ డౌట్ వ్య‌క్తం చేసారు. ర‌ణ‌బీర్ క‌పూర్ శ్రీ‌రాముడిగా, సాయిప‌ల్ల‌వి సీత‌గా న‌టిస్తున్న రామాయ‌ణ్ చిత్రానికి నితీష్ తివారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ముఖేష్ ఖ‌న్నా కామెంట్ హాట్ టాపిగ్గా మారింది.

ఆదిపురుష్‌లో శ్రీ‌రాముడిగా న‌టించిన ప్ర‌భాస్ గురించి ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ.. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్ర‌జ‌లు ప్ర‌భాస్‌ని అంగీకరించలేదని అన్నారు. అతడు చెడ్డ నటుడని కాదు.. కానీ రాముడిలా కనిపిండం లేదు. ఇప్పుడు శ్రీ‌రాముడిగా నటిస్తున్న నటుడు కపూర్ కుటుంబానికి చెందిన వాడు... కానీ నేను అతడి ముఖాన్ని చూస్తున్నాను.. అతడు కేవలం యానిమల్‌గా కనిపించాలని ఆశిస్తున్నాను.. ఆ పాత్ర‌ అత‌డికి భంగం కలిగించదు! అని వ్యాఖ్యానించారు.

యానిమ‌ల్‌లో రణబీర్ ప్రతికూల పాత్ర రామాయణంపై ప్రభావం చూపుతుందని ముఖేష్ ఖన్నా భయం వ్య‌క్తం చేసారు. ఇటీవ‌ల సోనాక్షి సిన్హాను త‌న తండ్రి, వెట‌ర‌న్ హీరో శ‌త్రుఘ్న‌సిన్హా సరిగా పెంచ‌లేద‌ని ముఖేష్ ఖ‌న్నా వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత సోనాక్షి, శ‌త్రుఘ్న అతడిపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌స్తుతం శ‌క్తిమాన్ వ‌రుస‌ ఇంట‌ర్వ్యూలు వెబ్ మీడియాని హీటెక్కిస్తున్నాయి.

Tags:    

Similar News