500 కోట్లైనా..కోటైనా ఒకేలా పనిచేస్తా!
యువ సంగీత సంచలనం అనిరుద్ పేరిప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే.
యువ సంగీత సంచలనం అనిరుద్ పేరిప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న సంగతి తెలిసిందే. `విక్రమ్`..`జైలర్`..`జవాన్` లాంటి వరుస హిట్లు పాన్ ఇండియాలో భారీ విజయాలు సాధించ డంలో అనిరుద్ పాత్ర ఎంతో కీలకం గా కనిపించింది. అతని సంగీతం సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. దీంతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు.
మ్యూజిక్ లెజెండ్ రెహమాన్ తర్వాత స్థానం అనిరుద్ దే అంటూ విమర్శకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా అనిరుద్ సినిమాల విషయంలో తన కమిట్ మెంట్ అనేది ఎలా ఉంటుందో రివీల్ చేసారు. నాకు 500 కోట్ల బడ్జెట్ సినిమా అయినా..కోటి రూపాయల బడ్జెట్ సినిమా అయినా ఒకటే. బడ్జెట్ పెరిగిందని ఆ సినిమా కోసం ప్రత్యకంగా కసరత్తులు చేయను. కోటి రూపాయల సినిమా అని అంతే అలసత్వంతోనూ పనిచేయను.
రెండూ సినిమాలే. ఏ సినిమాకైనా ఒకేలా పనిచేస్తాను. ఏ పని చేసినా వంద శాతం కష్టపడి పనిచేస్తాను. విజయం సాధించాలి అనే లక్ష్యం నిర్దేశించుకునే పనిలోకి దిగుతాను` అన్నారు. అలాగే జైలర్ హుకుం గురించి మాట్లాడుతూ..` జైలర్ కథ ప్రకారం కేవలం ఒక్క పాటకే ప్లాన్ చేసుకున్నాం. దీనిలో భాగంగానే `బంధములే` కంపోజ్ చేసాం. సినిమా రఫ్ వెర్షన్ చూసిన తర్వాత ఇంకా పాటలకు స్కోప్ ఉందని పిం చింది.
జైలర్ సీక్వెన్స్ లో రజనీకాంత్ చెప్పు హుకూంనాకెంతో నచ్చింది. దాన్ని ఓ పాటలా క్రియేట్ చేయాల నిపించింది. అలా హుకూం సిద్దమైంది. అది బాగా కనెక్ట్ అయింది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ విషయంలో నెల్సన్ నన్ను చాలా గుడ్డిగా నమ్మేస్తుంటాడు` అని అన్నారు. ప్రస్తుతం అనిరుద్ తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తోనన `దేవర` సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇంకా కొత్త అవకాశాలు వస్తున్నా! ఆయన కోలీవుడ్ చిత్రాలవైపే మొగ్గు చూపుతున్నారు. సక్సెస్ నేపథ్యంలో భారీగా పారితోషికం పెంచేసినట్లు ప్రచారం సాగుతోంది.