పవర్ చూపించాల్సిన టైమొచ్చింది థమన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా OG. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది

Update: 2023-09-01 04:25 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా OG. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని సుజిత్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా OG మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

సుజిత్ ఈ టీజర్ పైన ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో హైయెస్ట్ మూవీస్ కి మ్యూజిక్ అందిస్తున్న సంగీత దర్శకుడిగా థమన్ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో అతని నుంచి వచ్చిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా క్లిక్ కాలేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు థమన్ నుంచి వారసుడు, వీరసింహారెడ్డి, బ్రో సినిమాలు వచ్చాయి.

ఈ మూడు సినిమాలు బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా థమన్ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో సౌండ్స్ పడలేదని చెప్పాలి. అదే సమయంలో కోలీవుడ్ నుంచి అనిరుద్ మాత్రం అటు సాంగ్స్, ఇటు బ్యాగ్రౌండ్ స్కోర్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. జైలర్ మూవీ సక్సెస్ లో మేజర్ షేర్ అనిరుద్ కి ఇవ్వాల్సిందే. అంతలా మ్యూజిక్ ఇచ్చారు. అయితే ఆ లెవల్ లోనే బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేషన్ కి స్కోప్ ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ OG.

ఈ మూవీ టీజర్ పై భారీ హైప్స్ నెలకొని ఉన్నాయి. వాటిని అందుకోగలిగితే థమన్ మ్యూజిక్ కి మళ్ళీ భూమ్ వచ్చినట్లే. లేదంటే అతని డౌన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. థమన్ ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలబెట్టింది బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు సాంగ్స్ కూడా. అయితే సాంగ్స్ అయితే ఈ ఏడాదిలో వచ్చి ఏ సినిమా కూడా థమన్ కి అంత పేరు తీసుకురాలేదని చెప్పాలి.

ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ ముందు OG మూవీ స్ట్రాంగ్ ఆప్సన్ గా ఉంది. దీనిని ఎంత కరెక్ట్ గా ఉపయోగించుకొని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా మ్యూజిక్ అందిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం 10:35 నిమిషాలకి OG మూవీ టీజర్ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ టీజర్ కి థమన్ ఏ రేంజ్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తాడో వేచి చూడాలి.

Tags:    

Similar News