మైత్రి.. కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్!

మైత్రీ మూవీ మేకర్స్.. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంస్థ ప్రస్తుతం దూసుకుపోతోంది.

Update: 2024-04-15 02:40 GMT

మైత్రీ మూవీ మేకర్స్.. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంస్థ ప్రస్తుతం దూసుకుపోతోంది. భారీ బడ్జెట్‌ తో ఏకంగా ఆరు భారీ చిత్రాలను గ్రాండ్ గా ఒకదాని తర్వాత ఒకటిగా నిర్మిస్తోంది. వై రవి శంకర్, నవీన్ యెర్నేని ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ టాప్ బ్యానర్ పై రూపొందుతున్న అనేక చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.

అయితే సినిమాల నిర్మాణం వరకు కాకుండా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లోకి కూడా ఇటీవల అడుగుపెట్టింది మైత్రీ మూవీ మేకర్స్. ప్రభాస్ సలార్ మూవీతో థియేటర్‌ బిజినెస్‌ లోకి ఎంట్రీ ఇచ్చి భారీ లాభాలను అందుకుంది. ఆ తర్వాత హనుమాన్ సినిమాతో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్ వర్మ- తేజ సజ్జ కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మైత్రీ సంస్థకు కోట్ల లాభాలు తెచ్చిపెట్టింది.

ఇదంతా పక్కన పెడితే.. మైత్రీ సంస్థ ఇటీవల మూడు డబ్బింగ్ మూవీస్ ను విడుదల చేసింది. గత నెల చివర్లో మాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. పృథ్వీరాజ్ హార్డ్ వర్క్ కు, మూవీలోని విజువల్స్ కు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. కానీ ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. చెప్పుకోదగ్గ వసూళ్లు కూడా రాబట్టలేదు.

ఆ తర్వాత మాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ను విడుదల చేసింది మైత్రీ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభంలో భారీ వసూళ్లు సాధించింది. టాలీవుడ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న మలయాళ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. కానీ ఆ తర్వాత కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి.

ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని సినిమా లవ్ గురు డబ్బింగ్ వెర్షన్ ను కూడా మైత్రీ సంస్థే రిలీజ్ చేసింది. సినిమా ఫర్వాలేదని రివ్యూలు వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద రివ్యూల రేంజ్ లో వసూళ్లు రాలేదు. టాలీవుడ్ స్ట్రయిట్ చిత్రాలు ఫ్యామిలీ స్టార్, గీతాంజలి మళ్లీ వచ్చింది మిక్స్ డ్ టాక్ అందుకున్న సమయంలో మైత్రీ సంస్థ మంచి సినిమాలనే రిలీజ్ చేసినా.. ఆ మూవీలు అనుకున్నంత స్థాయిలో క్లిక్ అవ్వలేదని చెప్పాలి. మరి భవిష్యత్తులో డబ్బింగ్ వెర్షన్లతో మైత్రీ సంస్థ ఎలాంటి లాభాలు అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News