అందాల నభా అందమైన వర్కౌట్‌ లుక్‌

తాజాగా ఈమె జిమ్‌లో ఉన్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. వర్కౌట్‌ డ్రెస్‌లోనే ఉన్న నభా నటేష్ మిర్రర్‌ సెల్ఫీలు తీసుకుని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

Update: 2024-12-09 09:15 GMT

వజ్రకాయ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నభా నటేష్‌. తెలుగులో ఈ అమ్మడు సుధీర్ బాబుతో కలిసి నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2018లో విడుదల అయిన ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ముఖ్యంగా అందంతోనే కాకుండా నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని మంచి నటి అని కితాబు పొందింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ప్రతిభ ఉన్న నటి అంటూ నిరూపించుకున్న నేపథ్యంలో ఈ అమ్మడికి టాలీవుడ్‌ నుంచి వరుసగా ఆఫర్లు దక్కాయి.

 

తెలుగులో ఈ అమ్మడు మొదటి సినిమాతో పాజిటివ్ టాక్ దక్కించుకుని, ఇస్మార్ట్‌ శంకర్‌తో కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. బాడీ లాంగ్వేజ్‌తో పాటు, డైలాగ్‌ డెలవరీ భలే ఉంది అంటూ అందరితోనూ మెప్పు పొందింది. ఇక టాలీవుడ్‌లో ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అని అంతా భావించారు. అయితే ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తర్వాత కరోనా వల్ల నభా నటేష్‌కి ఎక్కువ ఆఫర్లు దక్కలేదు. దాంతో మళ్లీ డౌన్ అయ్యింది. ఇప్పుడు కాస్త బిజీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడి రచ్చ కంటిన్యూ చేస్తోంది.

 

రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో ఉండే నభా నటేష్ మరోసారి తన అందమైన రూపంతో ఆకట్టుకుంది. ఆకట్టుకునే అందంతో పాటు ఆహా అనిపించే స్థాయిలో ఈ అమ్మడి యొక్క లుక్ ఉండటంతో టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఈ అమ్మడి యొక్క ఫోటోలు వీడియోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఈమె జిమ్‌లో ఉన్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. వర్కౌట్‌ డ్రెస్‌లోనే ఉన్న నభా నటేష్ మిర్రర్‌ సెల్ఫీలు తీసుకుని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

బక్క పలుచని ఈ అమ్మడు సెల్ఫీ భలే అందంగా ఉంది. ముఖ్యంగా నడుము అందం చూపిస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. జిమ్‌లో ఇంతటి అందం ఉంటే ఇతరులు వర్కౌట్స్ ఎలా చేస్తారంటూ కొందరు సరదాగా కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు. ఇంతటి అందగత్తెకు దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదు, ముందు ముందు అయినా ఈమెకు సినిమాల్లో వరుసగా ఆఫర్లు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈమె ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఉంది.

Tags:    

Similar News