మైత్రీ మాలీవుడ్ నడిగర్.. టీజర్ ఎలా ఉందంటే?
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గా దూసుకుపోతోంది మైత్రీ మూవీ మేకర్స్
మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ గా దూసుకుపోతోంది మైత్రీ మూవీ మేకర్స్. ఈ బ్యానర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. పుష్ప, రంగస్థలం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన మైత్రీ సంస్థ.. ఇటీవల డిస్ట్రిబ్యూషన్ లోకి కూడా అడుగుపెట్టింది.
టాలీవుడ్ లో అనేక మూవీలను రూపొందిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు మాలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమైంది. మిన్నల్ మురళి, తల్లుమల, 2018 చిత్రాలతో వరుస విజయాలు సాధించిన మలయాళ స్టార్ టోవినో థామస్ తో ఓ సినిమా తీస్తోంది. తెలుగులో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న టోవినో థామస్ తో పాన్ ఇండియా మూవీ 'నడిగర్' రూపొందిస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో టోవినో థామస్.. స్టార్ నటుడు డేవిడ్ పడిక్కల్ గా కనిపించబోతున్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. వరుస సినిమాలతో సక్సెస్ సాధించిన ఓ స్టార్, ఆ తర్వాత కొద్ది రోజులకు తన నటనకు విమర్శలు ఎదుర్కొంటారు. అందరూ క్రిటిసైజ్ చేస్తుంటారు. వీటన్నింటిని ఆయన ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా స్టోరీ అని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు డ్రైవింగ్ లైసెన్స్ ఫేమ్ జీన్ పాల్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మే3వ తేదీన విడుదల కానున్న ఈ మూవీలో సౌబిన్ షాహిర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా సినిమా ఈ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. టీజర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ట్వీట్ చేసింది. టీజర్ బాగుందని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం తలెత్తింది. ముందుగా ఈ మూవీ పేరును నడిగర్ తిలకంగా ఫిక్స్ చేశారు మేకర్స్. దీంతో తమిళ సినీ నటుడు శివాజీ గణేషన్ ఫ్యాన్స్.. టైటిల్ మార్చమని డిమాండ్ చేశారు. ఎందుకంటే శివాజీ గణేషన్ ను అంతా నడికర్ తిలకం అని పిలుస్తుంటారు. దీంతో మేకర్స్ టైటిల్ ను నడిగర్ గా మార్చేశారు. మరి మాలీవుడ్ ఫస్ట్ సినిమాతో మైత్రీ సంస్థ.. ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.