నాగ్ 100 వ సినిమా.. ఈ ప్లాన్ సెట్టయినట్లే..
ఇక ఇప్పుడు నాగార్జున 100వ సినిమాని ఓ తమిళ యువ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం అందుతోంది.
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఈ సంక్రాంతికి 'నా సామిరంగ' సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇదే జోష్ లో నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ కానున్నారు. నా సామిరంగ తో సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి కలిసి రావడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి 'బంగార్రాజు' పార్ట్-3 ని ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ వచ్చింది.
ఈ విషయం కాస్త పక్కన పెడితే.. నాగార్జున 100వ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య నాగ్ వందో సినిమాని 'గాడ్ ఫాదర్' మూవీ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ తర్వాత అందులో వాస్తవం లేదని తెలిసింది. ఇక ఇప్పుడు నాగార్జున 100వ సినిమాని ఓ తమిళ యువ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం అందుతోంది.
తమిళంలో 'మూడర్ కూడం' అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. ఇటీవలే కథా చర్చలు కూడా జరిగాయని, నాగార్జునకి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు. సుమారు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిసింది.
కోలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
#DNS అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ డాన్ గా కనిపించబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్ గానే తిరుపతి పరిసర ప్రాంతాల్లో షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న మూవీ టీం నెక్స్ట్ షెడ్యూల్ ని గోవాలో ప్లాన్ చేసింది.