ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా : నాగ చైతన్య

ఇటీవల నాగ చైతన్య జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-29 09:48 GMT

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ వివాహ వేడుక డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా జరగబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ఏయన్నార్‌ విగ్రహం ఎదురుగా వీరి వివాహం జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మంగళ స్థానాల కార్యక్రమం కూడా పూర్తి అయింది. పెళ్లి తంతు ప్రారంభంకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్‌ మీడియా ద్వారా బయటకు వచ్చేశాయి. అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు శోభిత కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్‌కి చేరుకోవడం జరిగిందని సమాచారం అందుతోంది.

ఇటీవల నాగ చైతన్య జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణ స్టూడియోలో, తాత ఏయన్నార్‌ విగ్రహం ఎదురుగా జరగబోతున్న పెళ్లి కావడంతో చాలా నెర్వస్‌గా ఉంది. పెళ్లి రోజు కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అన్ని ఆచారాలతో జరగబోతున్న పెళ్లితో శోభితతో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని నాగ చైతన్య పేర్కొన్నారు. శోభితతో తాను చాలా డీప్‌గా కనెక్ట్‌ అయ్యాను. ఆమె నన్ను అన్ని విధాలుగా అర్థం చేసుకుంటుంది. మా ప్రయాణం అద్భుతంగా ఉండబోతుంది అనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్ల పాటు సింగిల్‌గానే జీవితాన్ని సాగించిన నాగ చైతన్య జీవితంలో శోభిత ఏ సమయంలో తారస పడిందో కానీ ఇద్దరు ప్రేమలో పడ్డారు. గత రెండు సంవత్సరాలుగా వీరి ప్రేమకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు వారి ప్రేమ విషయాన్ని స్వయంగా అక్కినేని ఫ్యామిలీ నిర్ధారిస్తూ పెళ్లి చేస్తున్నాం అంటూ అధికారికంగా ప్రకటించడం జరిగింది. పెళ్లి విషయాన్ని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే వివాహ నిశ్చితార్థం సైతం జరిగింది. పెళ్లి ముహూర్తం కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో తండేల్‌ సినిమాను చేస్తున్నాడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించడం వల్ల అంచనాలు భారీగా పెరిగాయి. ఇటీవలే విడుదల అయిన బుజ్జితల్లి పాటకి మంచి రెస్పాన్స్ దక్కింది. సంక్రాంతికి రావాలి అనుకున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్ణయించారు. సంక్రాంతి పోటీకి వద్దు అనే ఉద్దేశ్యంతో తదుపరి నెలలో విడుదల చేయబోతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా మెచ్చే విధంగా ఉంటుంది.

Tags:    

Similar News