నాగ చైతన్య- శోభిత పెళ్లి తేదీ ఫిక్స్!

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ నేటి సాయంత్రం ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్య‌క్ర‌మంలో ఎంతో ఉత్సాహంగా క‌నిపించారు.

Update: 2024-10-28 17:36 GMT

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ నేటి సాయంత్రం ఏఎన్నార్ జాతీయ అవార్డుల కార్య‌క్ర‌మంలో ఎంతో ఉత్సాహంగా క‌నిపించారు. అతిథుల‌ను స్వాగ‌తిస్తూ హోస్టులుగా అల‌రించారు. ఈ జంట నిశ్చితార్థం ఇప్ప‌టికే జ‌రిగింది. ఇటీవ‌లే

శోభిత కుటుంబంలో వివాహ స‌న్నాహాలు ప్రారంభమయ్యాయి.

శోభిత ఇటీవల వైజాగ్‌లోని తన నివాసం నుండి ఫోటోలను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. పెళ్లి వేడుకకు అధికారికంగా ఏర్పాట్లు ప్రారంభించినట్లు చైత‌న్య అత్త‌మామ‌లు ప్రకటించారు. అయితే చై- శోభిత జంట ఒక‌ట‌య్యే సుమూహూర్తం నిర్ణ‌యించారా లేదా? అంటే.. దానికి సంబంధించిన కీల‌క స‌మాచారం అందింది. తాజా స‌మాచారం మేర‌కు పెళ్లి తేదీ ఫిక్స‌యింది. డిసెంబర్ 4న నాగ చైతన్య- శోభిత జంట‌ వివాహం జరగనుంది.

గతంలో సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగ చైతన్య శోభిత‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. ఈ జంట ప్రేమాయ‌ణంపై చాలా కాలంగా మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఎట్ట‌కేల‌కు పెళ్లి కార్డ్ తో క‌థ సుఖాంతం అవుతోంది. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో తండేల్ లో న‌టిస్తున్నాడు. శోభిత బ‌హుభాషా న‌టిగా కొన‌సాగుతోంది. అటు హిందీలోను బిజీ న‌టి.

Tags:    

Similar News