కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్‌పై నాగ‌చైత‌న్య క‌న్ను

నిజ ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన రియ‌లిస్టిక్ సినిమాల‌పై ప్ర‌జ‌ల్లో క్యూరియాసిటీ నెల‌కొంటుంది. అలాంటి ఒక నిజ క‌థ‌తో రూపొందించిన `తండేల్` ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-01-27 05:39 GMT

నిజ ఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన రియ‌లిస్టిక్ సినిమాల‌పై ప్ర‌జ‌ల్లో క్యూరియాసిటీ నెల‌కొంటుంది. అలాంటి ఒక నిజ క‌థ‌తో రూపొందించిన `తండేల్` ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. `ల‌వ్ స్టోరి`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న‌ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌- సాయిప‌ల్ల‌వి జంట మ‌రోసారి రిపీట‌వుతుండ‌డంతో ఈ మూవీపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మ‌రోవైపు కార్తికేయ‌, కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్ట‌ర్ల‌ను తెర‌కెక్కించిన చందు మొండేటి తండేల్ కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి ఒక ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరిని తెర‌పైకి తెస్తున్నార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

తండేల్ చిత్రాన్ని తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డం స‌హా హిందీలోను భారీగా రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ స‌న్నాహ‌కాల్లో ఉంది. భారీ రిలీజ్ కావ‌డంతో ఇది చైత‌న్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ తేవ‌డం ఖాయ‌మ‌ని కూడా టాక్ వినిపిస్తోంది. తండేల్ కోసం దాదాపు 90 కోట్ల బడ్జెట్ ని వెచ్చించార‌ని టాక్ ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే అద్భుతమైన బిజినెస్ చేసింది. ఇప్ప‌టికే మూడు సింగిల్స్ విడుద‌ల కాగా, ఇప్పటికే భారీ ప్రభావాన్ని చూపాయి.

శ్రీ‌కాకుళానికి చెందిన మ‌త్స్య‌కారుడు పాక్ జ‌లాల్లో చిక్కుకుని, దాయాది దేశంలో జైలుకి వెళ్లాక‌ ఏం జ‌రిగింద‌న్న‌దే ఈ సినిమా క‌థాంశం. కోస్ట్ గార్డ్స్ చేతిలో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన తండేల్ రాజు అనే జాలరి పాత్రలో చాయ్ కనిపిస్తాడు. దేశభక్తి అంశాలు, గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. ఇందులో ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరి కార‌ణంగా చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి మ‌రోసారి బెస్ట్ పెర్ఫామ‌ర్స్ గా నిరూపించుకునేందుకు ఆస్కారం ఉంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ పాన్-ఇండియా చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవానికి వారం ముందు ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. జ‌న‌వ‌రి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా చై, సాయి పల్లవి, చందూ మొండేటి , నిర్మాత అల్లు అరవింద్ లతో కూడిన టీం ఇప్ప‌టికే ప్రమోషన్స్ ని ప్రారంభించింది. జనవరి 28న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురించి అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News