సితార నిర్మాతకు ఎన్టీఆర్ హ్యాండ్..?

ఐతే ఈ ప్రెస్ మీట్ లో సితార బ్యానర్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేసే సినిమా గురించి ప్రస్తావించారు నాగ వంశీ.;

Update: 2025-03-26 15:12 GMT
సితార నిర్మాతకు ఎన్టీఆర్ హ్యాండ్..?

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ వరుస క్రేజీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మ్యాడ్ స్క్వేర్ తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగ వంశీ. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నేడు జరిగింది. ఐతే ఈ ప్రెస్ మీట్ లో సితార బ్యానర్ లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చేసే సినిమా గురించి ప్రస్తావించారు నాగ వంశీ.

నెల్సన్ తో నెక్స్ట్ ఇయర్ సినిమా ప్లానింగ్ లో ఉందని ఐతే ఆ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదని అన్నారు నాగ వంశీ. ఐతే అంతకుముందు ఈ నిర్మాత నెల్సన్ దిలీప్ కుమార్ ని ఎన్టీఆర్ కోసం లైన్ లో పెడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. జైలర్ సినిమా తర్వాత నెల్సన్ తో సినిమా చేయాలని తెలుగు స్టార్స్ కూడా ఆసక్తి చూపించారు. వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నాడని టాక్.

అందుకే నాగ వంశీ నెల్సన్ తో సినిమాకు రెడీ అయ్యారు. ఐతే నెల్సన్ డైరెక్షన్ లో సితార చేసే సినిమాలో హీరో ఎన్టీఆర్ అని ఆడియన్స్ కూడా ఫిక్స్ కాగా కొత్తగా నాగ వంశీ ఆ సినిమాలో హీరో ఇంకా ఫైనల్ అవ్వలేదని అనడం అందరికీ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా కేవలం నాగ వంశీ అనుకున్నాడా లేదా నెల్సన్ తో ఈ టైం లో సినిమా వద్దని ఎన్టీఆర్ అనుకున్నాడా అన్నది తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా ఎన్టీఆర్ తో నాగ వంశీ సినిమా ఉంటుందని అనుకున్న ఆడియన్స్ కి ఈ ట్విస్ట్ షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ సితార బ్యానర్ లో నెల్సన్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో హీరో ఎవరు అన్న చర్చ కూడా మొదలైంది. ఎన్టీఆర్ విషయానికి వస్తే వార్ 2 పూర్తి చేసే పనుల్లో ఉండగా ప్రశాంత్ నీల్ సినిమా ఈమధ్యనే మొదలైంది. సో నెక్స్ట్ ఇయర్ దాకా నీల్ కోసమే పని చేసే ఛాన్స్ ఉంటుంది.

ఆ తర్వాత కొరటాల శివ తో దేవర 2 పూర్తి చేసే ప్లానింగ్ లో ఉన్నాడు తారక్. మరి ఈ గ్యాప్ లో నెల్సన్ తో సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News