నాగార్జునను నాగచైతన్య డాడీ అంటే ఇలా!
కానీ అలాంటి సన్నివేశాలు చూడటం అన్నది దాదాపు అసాధ్యమే.
నాగార్జున-నాగచైతన్య తండ్రీకొడుకుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి సినిమాలు చేసారు. తెరపై ఆ కాంబినేషన్ లో సన్నివేశాలు ఎలా ఉంటాయో? అందరికీ తెలుసు. కానీ ఆఫ్ ది స్క్రీన్ వాళ్ల మధ్య రియల్ బాండింగ్ ఎలా ఉంటుంది? అన్నది చాలా మందికి తెలియదు. సెలబ్రిటీలు ఇన్ సైడ్ ఎలా ఉంటారో తెలుసుకోవాలి? అన్న కుతుహాలం అందరిలో ఉంటుంది. కానీ అలాంటి సన్నివేశాలు చూడటం అన్నది దాదాపు అసాధ్యమే.
వాళ్లంతా నటులుగానే ప్రేక్షకులకు తెలుస్తారు తప్ప! వాళ్ల మధ్య రిలేషన్ షిప్స్ ఎలా ఉంటాయి. ఒకర్ని ఒకరు ఎలా పలకరించుకుంటారు వంటివి తెలియదు. మరి కింగ్ నాగార్జునను నాగచైతన్య డాడీ అని పిలిస్తే ఎలా ఉంటుందో ఎవరైనా చూసారా? అయితే ఇప్పుడు చూసేయండి. నిన్నటి రోజున ఏఎన్నార్ అవార్డు వేడుకలో భాగంగా అక్కినేని కుటుంబం గ్రాండ్ గా ఆ ఈవెంట్ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీలో ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా అంతా హాజరయ్యారు.
ఈ సమయంలో నాగార్జున అందర్నీ కవర్ చేస్తూ కొన్ని ఫోటోలు కూడా తీయించుకున్నారు. ఈ సందర్భంలో నాగ చైతన్య అక్కడే ఉన్నాడు. పక్కనే ఉన్న నాగార్జున గెస్ట్ ల రాకపోకతలు..వాళ్లను రిసీవ్ చేసుకోవడం..ఫోటో సెషన్ చూసుకోవడం ఇలా రకరకాల పనుల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో నాగచైతన్య డాడీ అంటూ నాగార్జునను పిలిచారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.
ఆ వీడియో చూసి అక్కినేని అభిమానులు మురిసిపోతున్నారు. చూసారా? నాగ్ ని చైతన్య ఎంత ప్రేమగా డాడీ అని పిలుస్తున్నాడో? అంటూ నెటి జనులు పోస్టులు పెడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఇలాంటి వీడియోలు బయటకు రావడం అన్నది చాలా రేర్. ఫ్యామిలీ విషయాలేవి బయటకు రావు. ఆ ఫ్యామిలీ హీరోలంతా కేవలం సినిమా అప్ డేట్స్ తప్ప! ఫ్యామిలీ బాండింగ్ గురించి పెద్దగా రివీల్ చేయరు. ఈ నేపథ్యంలో కింగ్ ని డాడీ అని చై పిలిచిన వీడియో చూసి అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. అంతేగా ఇలాంటి రేర్ మూవ్ మెంట్స్ చూసినప్పుడు ఆ ఫీల్ సహజం.