ఫాదర్స్ డే: యువ సామ్రాట్‌తో బాల సామ్రాట్
ప్రపంచం మొత్తం ఫాదర్స్ డేని జరుపుకుంటుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు.
ప్రపంచం మొత్తం ఫాదర్స్ డేని జరుపుకుంటుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. వారు తమ తండ్రుల పట్ల తమ ప్రేమను, ఆప్యాయతను చూపుతారు. సామాన్యులు మాన్యులు అనే తేడా లేనే లేదు. సెలబ్రిటీల గురించి.. వారి తండ్రితో వారి ప్రేమ, బంధం గురించి మరింత తెలుసుకోవడానికి అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
నాగ చైతన్య తన తండ్రి నాగార్జునతో కలిసి గతంలో ఎన్నడూ చూడని ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఫోటోగ్రాఫ్ లో నాగార్జున తన కుమారుడు నాగ చైతన్యతో కలిసి కలర్ఫుల్గా కనిపించాడు. చెట్టు బ్యాక్‌డ్రాప్‌లో చిన్నారి నాగ చైతన్య తన అమాయకపు చూపులతో కనిపిస్తున్నాడు.
నాగార్జున తన సొంత అన్నపూర్ణ స్టూడియోస్‌లో తన సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇదని ఇన్సైడ్ టాక్. అక్కినేని హీరోల అభిమానులు యువ నాగార్జున - బాల నాగ చైతన్యలను కలిసి చూడడానికి చాలా సంతోషిస్తున్నారు. వారంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఫాదర్స్ డే రోజున త్రోబాక్ ఫోటో స్పెషల్ ట్రీట్ గా మారిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటోని తీసినప్పుడు నాగ చైతన్యకు దాదాపు 7 సంవత్సరాల వయస్సు ఉంటుందని సోర్స్ షేర్ చేసింది.
నాగ చైతన్య పెద్దవాడయ్యాక కూడా తన తండ్రి నాగార్జున అడుగుజాడల్లో నడిచాడు. నవ యువ సామ్రాట్‌గా అందరికీ ప్రియమైనవాడిగా ఎదిగాడు. డిఫరెంట్ జోనర్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్లు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తండేల్ అనే సినిమాతో అభిమానుల ముందుకు రానున్నాడు. అక్కినేని చిన్నోడి స్పెషల్ త్రోబ్యాక్ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది.