నాగార్జున అవకాశం ఇవ్వడంతో సత్యం రాజేష్!
ఇప్పటివరకూ కేవలం కమెడియన్ గా...క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన రాజేష్ సినిమా కి కనవ వర్షం కురుస్తుండటంతో టీమ్ అంతా సంతోషంగా ఉంది.
'పొలిమేర-2' విజయంతో సత్యం రాజేష్ పేరు మారు మ్రోగిపోతుంది. పరిమిత బడ్జెట్ లో చేసిన ఈ సినిమా భారీగా వసూళ్లని సాధిస్తుంది. ఈ రేంజ్ లో విజయం సాధిస్తుందని యూనిట్ సైతం గెస్ చేయనిది. బలమైన కంటెంట్ తో థియేటర్లలో రన్నింగ్ లో ఉన్న చిత్రమిది. ప్రేక్షకుల ఆధరణ చూసి థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు వినిపిస్తుంది. ఇలా సత్యం రాజేష్ సినిమాకి థియేటర్లు పెరగడం అన్నది ఇదే అతని జీవితంలో తొలి ఘట్టం.
ఇప్పటివరకూ కేవలం కమెడియన్ గా...క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన రాజేష్ సినిమా కి కనవ వర్షం కురుస్తుండటంతో టీమ్ అంతా సంతోషంగా ఉంది. అయితే రాజేష్ ఈ స్థానానికి చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎదిగే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో రివీల్ చేసాడు. 'విలన్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చా. అవకాశం ఇవ్వండి అంటే నువ్వు విలన్ గా చేస్తావా? అంటూ నవ్వారు.
దీంతో సరైన తిండి లేక బక్కచిక్కాను. పీనుగులా తయరయ్యాను. అయినా ఆపీసులు చుట్టి తిరిగి అడిగితే నవ్వుకున్నారు. అలా అడగ్గా చివరికి ప్రెండ్స్ గ్రూప్ లో నటించే అవకాశం వచ్చింది. ఈ సమయంలోనే సత్యం సినిమా అవకాశం వచ్చింది. అందులో సుమంత్ స్నేహితుడి పాత్ర కోసం అలీని తీసుకోవాల నుకున్నారు. అప్పటికే షూటింగ్ జరుగుతుంది. అయితే అదే సమయంలో అలీ దుబాయ్ లో ఉన్నారు. ఇండియాకి తిరిగి రావడం ఆలస్యమైంది.
దీంతో షెడ్యూల్ ఆలస్యమవుతుంది. దర్శకుడు సూర్య కిరణ్ రాజేష్ ని ఆ పాత్రకి తీసుకుందామని నాగార్జున గారి దృష్టి తీసుకెళ్లారు. తొలుత ఆయన ఒప్పుకోలేదు. అలీ వచ్చే దాకా వెయిట్ చేద్దాం అన్నారు. దీంతో మరోసారి సూర్య కిరణ్ కలగజేసుకుని రాజేష్ టైమింగ్ పై నమ్మకం ఉంది. అవకాశం ఇవ్వడి అని అడిగారు. దీంతో నాగార్జున గారు ఒప్పుకున్నారు. అలా హీరో స్నేహితుడి పక్కన మంచి రోల్ దొరకింది. ఆసినిమా నా జీవితాన్నే మార్చేసింది' అని అన్నారు.