లెజెండ్ ANR పైనుంచి అంతా చూస్తూనే ఉన్నారు!
బంధం నిలబడటానికి డబ్బు కంటే సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమని పెద్దలు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.
నాగ చైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి అక్కినేని కుటుంబంలో కొత్త ఆనందాన్ని నింపిందన్న సంగతి తెలిసిందే. తెలుగింటి సాంప్రదాయాలను తన ఇంటికి తీసుకొస్తున్న అచ్చ తెలుగమ్మాయి శోభిత తమ ఇంటికి కోడలు అయిందన్నదే నాగ్‌లో అమితానందం నింపింది. బంధం నిలబడటానికి డబ్బు కంటే సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యమని పెద్దలు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. అక్కినేని కుటుంబం ఇప్పుడు దానికి పరిపూర్ణంగా విశ్వసించింది.
చై- శోభిత వివాహం నుండి అధికారిక ఫోటోలను షేర్ చేసిన నాగ్ మోములో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించడానికి ఇదే ప్రధాన కారణం. 'మేడ్ ఇన్ హెవెన్' స్టార్ శోభిత తమ ఇంటికి కొత్త కళను తెచ్చిందని కింగ్ నమ్ముతున్నారు. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున ఇన్‌స్టాలో ఒక ఎమోషనల్ నోట్ రాసారు. ''నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతోంది'' అని నాగార్జున రాశారు, ''మీడియాకు, మీ అవగాహనకు ఈ అందమైన క్షణాన్ని ఆదరించడానికి మాకు స్పేస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆలోచనాత్మకమైన గౌరవం .. శుభాకాంక్షలు మా ఆనందాన్ని పెంచాయి'' అని రాసారు.
మా ప్రియమైన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, మీ ప్రేమ - ఆశీర్వాదాలు ఈ సందర్భాన్ని నిజంగా మరచిపోలేనివిగా చేశాయి. నా కుమారుడి వివాహం కేవలం కుటుంబ వేడుక కాదు.. మీరందరూ పంచుకున్న ఆప్యాయత .. మద్దతు కారణంగా మాకు ఇది ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకంగా మారింది. మీరు మాపై కురిపించిన ప్రేమ, లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు మా కుటుంబం తరపున హృదయాంతరాళం నుండి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము''అని రాసారు.
శోభిత- చై జంట అందమైన అధ్యాయాన్ని చూడటం నాకు ఒక ప్రత్యేకమైన భావోద్వేగ క్షణం. నా ప్రియమైన చైకి అభినందనలు.. ప్రియమైన శోభిత కుటుంబానికి స్వాగతం-మీరు ఇప్పటికే చాలా ఆనందాన్ని తెచ్చారు'' అని నాగ్ ఈ సందర్భంగా అన్నారు. ఈ వేడుక శత జయంతి సంవత్సరానికి గుర్తుగా స్థాపించిన ANR విగ్రహం చెంత ఆయన ఆశీర్వాదంతో అర్థవంతంగా కొనసాగింది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో ఏఎన్నార్ ప్రేమ, మార్గదర్శకత్వం మాకు ఉన్నట్లు అనిపించింది. లెక్కలేనన్ని ఆశీర్వాదాలు మాకు అందాయి'' అని అన్నారు.
చైతన్య- శోభిత జంట వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగింది. 1976లో తన తాత అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన స్టూడియోలో ఈ సంబరం జరిగింది. బంజారాహిల్స్‌లోని 22 ఎకరాల ఆస్తి సినిమా వారసత్వం - కుటుంబ గర్వానికి చిహ్నంగా నిలుస్తుంది.